ఆ మంత్రికి ప్ర‌జ‌ల కంటే కొడుకు హీరో అవ్వ‌డ‌మే ముఖ్య‌మా..!

ఏపీ మంత్రి గంటా శ్రీనివాస‌రావుపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు ఊపందుకున్నాయి. ఆ మంత్రిగారు త‌న సొంత లాభం కొంత కూడా మానుకోవ‌డం లేద‌ని, ప్ర‌జ‌ల‌ ప్ర‌యోజ‌నాల క‌న్నా.. త‌న సొంత ప్ర‌యోజ‌నాల‌కే ఆయ‌న పెద్ద పీట వేస్తున్నార‌ట‌! ప్ర‌స్తుతం దీనిపై అంద‌రూ చ‌ర్చించు కుంటున్నారు. మ‌రి అదేంటో చూద్దాం.. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఏపీలో అనేక ప‌రిశ్ర‌మ‌లు వెలిశాయి. ఇదే క్ర‌మంలో ఉమ్మ‌డిగా ఉన్న టాలీవుడ్ కూడా ఏపీలో విస్త‌రిస్తుంద‌ని అంద‌రూ భావించారు. ఇదే క్ర‌మంలో చంద్ర‌బాబు కూడా విశాఖ‌పై ఫోక‌స్ పెట్టారు.

పెట్టుబ‌డుల న‌గ‌రంగా దానిని అభివృద్ధి చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే విశాఖ త్వ‌ర‌లో టాలీవుడ్‌కి మ‌రో కేంద్రంగా డెవ‌ల‌ప్ అవుతుంద‌ని భావించారు. ఫ‌లితంగా ఉత్తరాంధ్ర జిల్లాల యువ‌త‌కు పెద్ద ఎత్తున ఉపాధి ల‌బిస్తుంద‌ని అనుకున్నారు.  అయితే, ఈ జిల్లాకు చెందిన మంత్రి గంటా శ్రీనివాస‌రావు దీనికి ఎంత మాత్ర‌మూ మొగ్గు చూప‌డం లేద‌ని పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. విశాఖ న‌గ‌రంపై ప‌ట్టు సాధించేందుకు గంటా ప్ర‌య‌త్నిస్తున్నారే త‌ప్ప ఈ న‌గ‌రానికి టీలీవుడ్‌ను తీసుకువ‌చ్చేందుకు మాత్రం ప్ర‌య‌త్నించ‌డం లేద‌ని స్థానికులు అంటున్నారు.

 మంత్రి గంటా త‌న‌ కుమారుడు ర‌వితేజ‌ను హీరో చేయ‌డంపై ఉన్న కాన్సంట్రేష‌న్‌లో కొంచెం కూడా ఇక్క‌డ మూవీ ఇండ‌స్ట్రీ డెవ‌ల‌ప్ అయ్యేలా చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌ని చెబుతున్నారు. కేవ‌లం టాలీవుడ్‌కి ఇక్క‌డ కొంత స్థ‌లం కేటాయించ‌డంలో చ‌క్రం తిప్పిన ఆయ‌న త‌ర్వాత దాని ఊసు ప‌ట్టించుకోలేద‌ని అన్నారు. ఇక‌, ఇప్పుడు ప‌ట్టించుకోక‌పోతే.. ఎప్ప‌టికి మూవీ ఇండ‌స్ట్రీ ఇక్క‌డికి వ‌స్తుంద‌ని వారు ప్ర‌శ్నిస్తున్నారు.

అయితే, గంటా మంత్రిగా ఉన్న‌ప్ప‌టికీ.. సీఎం చంద్ర‌బాబుతో ఆయ‌న‌కు పెద్ద గా కాంటాక్ట్స్ లేవ‌ని తెలుస్తోంది. ఆయ‌న‌పై వ‌చ్చిన అవినీతి ఆరోప‌ణ‌ల నేప‌థ్యంతో టీడీపీ అధినేత ఫైర‌వుతున్నార‌ని, గంటా వియ్యంకుడు, మ‌రో మంత్రి నారాయ‌ణ త‌దితరులు చెబుతుండ‌డం, కాపు సామాజిక వ‌ర్గం నేప‌థ్యంలోనే గంటాను కొన‌సాగిస్తున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. అందుకే ఆయ‌న జిల్లా పై క‌న్నా త‌న జ‌నాల‌పైనే శ్ర‌ద్ధ చూపించుకుంటున్నారి అంటున్నారు.