ఎన్టీఆర్‌-క‌ళ్యాణ్‌రామ్ మ‌ల్టీస్టార‌ర్ టైటిల్ ఇదే

తెలుగు తెర‌పై మ‌రో భారీ ఫ్యామిలీ మల్టీస్టార‌ర్ మూవీకి రంగం సిద్ధ‌మ‌వుతోంది. గ‌తంలో అక్కినేని ఫ్యామిలీ హీరోలు అంద‌రూ క‌లిసి న‌టించిన మ‌నం సినిమా అక్కినేని ఫ్యామిలీ చ‌రిత్ర‌లోనే మ‌ర‌పురాని సినిమాగా నిలిచిపోయింది. ఇప్ప‌డు ఈ నేప‌థ్యంలోనే నంద‌మూరి ఫ్యామిలీ సినిమా కూడా వ‌చ్చేందుకు రంగం సిద్ధ‌మ‌వుతోంది.

నంద‌మూరి ఫ్యామిలీ హీరోల మ‌ల్టీస్టార‌ర్ సినిమా కోసం నంద‌మూరి అభిమానులు ఎప్ప‌టి నుంచో వెయిట్ చేస్తున్నారు. అయితే వీరి కోరిక మాత్రం తీర‌డం లేదు. అయితే ఎట్ట‌కేల‌కు నంద‌మూరి అభిమానుల కోరిక తీర‌నుంద‌ని తెలుస్తోంది. నంద‌మూరి హీరో క‌ళ్యాణ్‌రామ్ త‌న సొంత బ్యాన‌ర్ అయిన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై బ్ర‌ద‌ర్స్ అనే టైటిల్ రిజిస్ట‌ర్ చేయించారు.

ఈ బ్ర‌ద‌ర్స్ అనే టైటిల్ ఎన్టీఆర్‌-క‌ళ్యాణ్‌రామ్ క‌లిసి చేసే మ‌ల్టీస్టార‌ర్ సినిమా కోస‌మే అన్న ప్ర‌చారం జ‌రుగుతోంది. గ‌తంలో ఇదే టైటిల్‌తో కోలీవుడ్ హీరో సూర్య హీరోగా కేవి.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా వ‌చ్చింది. ఆ సినిమా అనుకున్నంత‌గా ఆడ‌లేదు.

ఇక ఇప్పుడు ఇదే టైటిల్‌తో నంద‌మూరి బ్ర‌ద‌ర్స్ సినిమా వ‌స్తుంద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల ఇన్న‌ర్ టాక్‌. బ్ర‌ద‌ర్స్ టైటిల్‌కు ఓ ప‌వ‌ర్ ఫుల్ క్యాప్ష‌న్ పెడ‌తార‌ని కూడా స‌మాచారం. ఈ మ‌ల్టీస్టార‌ర్ మూవీ గురించి త్వ‌ర‌లోనే క్లారిటీ రానుంది.