మిల్కీ బ్యూటీ ట్రిపుల్‌ ధమాకా.

తమన్నా ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘అభినేత్రి’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నెల 11 న సినిమా ఆడియో విడుదలవుతుంది. ముందుగా ఈ సినిమాలో అసలు పాటలుండవనీ, ఇది ఓ ఆర్ట్‌ ఫిలిం అనీ, గ్లామర్‌ లేకుండా తమన్నా కన్పిస్తుందని ప్రచారం జరుగుతోంది. మిల్కీ బ్యూటీ సినిమాలో గ్లామర్‌ లేకపోతే ఎలాగని ఆమె అభిమానులు ఫీలయ్యారు. అయితే గ్లామర్‌ లేదన్నది కేవలం ఉత్త గాసిప్‌ మాత్రమేనని తేలిపోయింది. మిల్కీ బ్యూటీ ఇందులో రెండు విభిన్న గెటప్స్‌లో కన్పిస్తుంది. ఒకటి డీ గ్లామర్‌ అయితే, ఇంకోటి ఫుల్‌ గ్లామర్‌ పాత్ర. కొరియోగ్రాఫర్‌, దర్శకుడు, నటుడు ప్రభుదేవాతోపాటు సోనూసూద్‌ ఈ చిత్రంలో ఇతర ముఖ్య తారాగణం.

అంతేకాదు ‘ఎవడు’ ఫేం అమీ జాక్సన్‌ కూడా ఇందులో నటిస్తోంది. సో తమన్నా గ్లామర్‌తో పాటు అమీజాక్సన్‌ గ్లామర్‌ కూడా ఈ సినిమాకు మెయిన్‌ అట్రాక్షన్‌. అయితే అమీ జాక్సన్‌ చాలా తక్కువ నిడివి గల పాత్రలో కనిపిస్తుందట. తమన్నా గ్లామర్‌ పాత్ర, డీ గ్లామర్‌ పాత్రలు ఈక్కెవల్‌ రేషియోలో ఉంటాయట. మొత్తానికి ఈ సినిమాతో తమన్నా తనలోని డిఫరెంట్‌ యాంగిల్‌ని బయటికి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ సినిమాతో ఒకేసారి మూడు భాషల్లోనూ సూపర్‌ హిట్‌ కొట్టాలని మిల్కీ బ్యూటీ అనుకుంటోంది. మిల్కీ బ్యూటీ ట్రిపుల్‌ ధమాకాకి టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్‌ రెడీ అయిపోవాల్సిందే.