బన్నీ సినిమాలో హన్సిక?

బన్నీ హీరోగా హరీష్‌ శంకర్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న సినిమాలో హీరోయిన్‌ కోసం వెతుకులాట కొనసాగుతోంది. కాజల్‌, కేథరీన్‌, మెహరీన్‌, ఇలా పేర్లు విన్పిస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా పాలబుగ్గల ముద్దుగుమ్మ హన్సిక పేరు వినిపిస్తోంది. తెలుగులో హన్సికకు ప్రస్తుతం సినిమాలేమీ లేవు. చాలా కాలంగా టాలీవుడ్‌కి బైబై చెప్పేసింది ఈ ముద్దుగుమ్మ. కానీ తమిళంలో ఫుల్‌ బిజీగా గడుపుతోంది. తాజాగా ఇప్పుడే మళ్లీ ఈ ముద్దుగుమ్మ పేరు వినిపిస్తోంది. బన్నీతో తొలి సినిమా ‘దేశముదురు’లో నటించింది హన్సిక. ఆ సినిమా సూపర్‌డూపర్‌ హిట్‌ అయ్యింది. బన్నీ ఇప్పుడు పెద్ద స్టార్‌. హన్సిక కూడా తమిళంలో నెంబర్‌వన్‌ హీరోయిన్‌గా వెలుగుతోంది. హరీష్‌ శంకర్‌, హన్సికను బన్నీ సినిమాకి ప్రిఫర్‌ చేసినట్లు తెలుస్తోంది.

అయితే ఈ సినిమాలో హన్సిక మెయన్‌ హీరోయిన్‌ కాదంటున్నారు. గెస్ట్‌రోల్‌లో కనిపిస్తుందని అంటున్నారు కొందరు. లేదు ఐటెం సాంగ్‌లో నటిస్తోంది అని అంటున్నారు మరికొందరు. గతంలో ‘బిల్లా’ సినిమాలో హన్సిక ఐటెం సాంగ్‌లో నటించింది. ఆ తరువాత ఆమె తమిళంలో బిజీ అయిపోయింది. అక్కడ కమర్షియల్‌ మూవీస్‌తో పాటు హారర్‌ మూవీస్‌లోనూ నటిస్తోంది. తెలుగులో ఆమెకు తగ్గ పాత్రలు రాకపోవడంతో ఇక అక్కడే సెటిలైపోయింది. ఈ సినిమాతో హన్సిక మళ్లీ తెలుగులోకి రీ ఎంట్రీ ఇవ్వనుంది. అయితే ఏ పాత్రలో ఈ ముద్దుగుమ్మ రీ ఎంట్రీ ఉంటుందో అనేది మాత్రం సస్పెన్స్‌.