పవర్‌ఫుల్‌ లుక్‌ వచ్చేస్తోంది.

డాలీ దర్శకత్వంలో పవన్‌ కళ్యాణ్‌ చేస్తున్న సినిమా ‘కాటమరాయుడు’. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ కూడా తాజాగా విడుదలైంది. బోలెడంత రెస్పాన్స్‌ వచ్చింది. అయితే ఈ సినిమాకి సంబంధించిన మరో ఫ్రెష్‌లుక్‌ని విడుదల చేసే యోచనలో చిత్ర యూనిట్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 20 నుండి ఈ చిత్ర షూటింగ్‌ స్టార్ట్‌ కానుంది. 24 నుంచి పవన్‌ కళ్యాణ్‌ షూటింగ్‌లో పాల్గొననున్నారు. అదే రోజు ‘కాటమరాయుడు’ న్యూలుక్‌ని రిలీజ్‌ చేయనున్నారట. ఈ సినిమాలో హీరోయిన్లుగా శృతి హాసన్‌, కాజల్‌ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అయితే ముద్దుగుమ్మ రకుల్‌ పేరు కూడా వినిపిస్తోంది.

కానీ ప్రెజెంట్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సో బిజీ. కాజల్‌ మెగాస్టార్‌ సినిమాలో నటిస్తోంది. ఛాన్సెస్‌ శృతిహాసన్‌కే ఎక్కువ ఉన్నాయి. అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఫ్యాక్షన్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు త్రివిక్రమ్‌ కూడా కొంత తన పనితనం చూపించినట్లు సమాచారమ్‌. ఇంపార్టెంట్‌ డైలాగ్స్‌ని రాసినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో పవన్‌ ఒరిజినల్‌ లుక్‌లో కనిపించనున్నాడని వినికిడి. మొత్తానికి ‘సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌’ పరాజయం తర్వాత వస్తోన్న ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి.