పవన్‌ భక్తిలో మరో భక్తుడు.

పవన్‌ని అభిమానించని వారు ఎవ్వరూ ఉండరు. వవన్‌ అంటే ఒక శక్తి. అదో ఆకర్షణ. ఇదంతా సామాన్య జనం అభిప్రాయం. అయితే ఇండస్ట్రీలో కూడా ఈ భావన చాలా మందికి ఉంటుంది. యంగ్‌ హీరో నితిన్‌ సంగతి తెలిసిందే. పవన్‌ అంటే ఎంత అభిమానమో. అలాగే చాలా మంది ఉన్నారు. తాజాగా బుల్లితెర ‘మొగలి రేకులు’ ఫేం సాగర్‌ హీరోగా వస్తోన్న ‘సిద్దార్ధ’ సినిమాను డైరెక్ట్‌ చేసిన దయనంద్‌ రెడ్డి కూడా పవన్‌కి అరివీర భక్తుడే. వీరిద్దరి ప్రయాణం ఇప్పటిది కాదు. ‘తమ్ముడు, బద్రి’, ఖుషీ’ సినిమాల దగ్గరి నుండీ వీరి ప్రయాణం నడుస్తోంది. ‘గబ్బర్‌ సింగ్‌’ సినిమా దగ్గర్నుంచీ దయానంద్‌ రెడ్డి పవన్‌ క్రియేటివ్‌ బ్యాచ్‌లో ఒక మెంబర్‌ అయిపోయాడు.

పవన్‌ ప్రోత్సాహంతోనే దర్శకుడిగా ఆయన ‘సిద్దార్ధ’ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకి పవన్‌ ఆశీస్సులు ఉంటాయని ఆయన భావిస్తున్నారు. అంతేకాదు తాను ఈ స్థాయికి రావడానికి కారణమైన పవన్‌తో ఒక సినిమాను తెరకెక్కించాలనే యోచనలో ఉన్నాడట ఈ డైరెక్టర్‌. కొత్త డైరెక్టర్లను, ప్రాడ్యూసర్లను ఎంకరేజ్‌ చేయడంలో పవన్‌ ముందుంటాడు. ఏమో ఈ డైరెక్టర్‌కీ ఛాన్స్‌ ఇచ్చినా ఇచ్చేస్తాడు. పవన్‌ బాడీ లాంగ్వేజ్‌కి తగ్గ స్టోరీ కోసం కసరత్తులు మొదలెట్టేశాడట డైరెక్టర్‌ దయానంద్‌ రెడ్డి. ఎప్పటికైనా పవన్‌తో సినిమా చేయాలనే ఆయన కోరిక ఫలించాలని ఆశిద్దాం.