నానితో అవసరాల కామెడీనా? సీరియస్సా?

నాని, అవసరాల శ్రీనివాస్‌ కలిసి కొన్ని చిత్రాల్లో నటించారు. ఇద్దరికీ ‘అష్టా చెమ్మా’ సూపర్‌ బ్రేక్‌ ఇచ్చిన చిత్రం. ఆ తరువాత కొన్ని సినిమాల్లో ఇద్దరూ కలిసి నటించారు కూడా. ఇద్దరికీ డైరెక్షన్‌ మీద ఇంట్రెస్ట్‌ ఉంది. అవసరాల శ్రీనివాస్‌ అయితే ఇప్పటికే దర్శకుడిగా మారాడు. మారడమే కాదు సక్సెస్‌ అయ్యాడు కూడా. తొలి సినిమాతోనే విషయం ఉందనిపించుకున్నాడు. రెండో సినిమా ‘జో అచ్చుతానంద’ను తెరకెక్కిస్తున్నాడు. ఈ శుక్రవారం ఈ సినిమా ధియేటర్లో సందడి చేయనుంది. అయితే తన కోస్టార్‌, మంచి ఫ్రెండ్‌ అయిన నాని హీరోగా ఓ సినిమా తెరకెక్కించాలనుకుంటున్నాడు అవసరాల.

ఇందుకోసం ఆల్రెడీ ఓ స్టోరీని ప్రిపేర్‌ చేసుకున్నాడనీ తెలుస్తోంది. అన్ని ఎమోషన్స్‌ పండించగల పరిపూర్ణ నటుడైన నానితో అవసరాల ఎలాంటి సినిమా చేస్తాడనేది సస్పెన్స్‌గా మారింది ఇప్పుడు. త్వరలోనే వీరి కాంబినేషన్‌లో సినిమా సెట్స్‌పైకి వస్తుంది. అవసరాలకి కామెడీ అంటే ఇష్టం. నాని ఇప్పుడేమో విలక్షణ కథాంశాలతో సినిమాలు చేస్తున్నాడు. సో, కామెడీ టచ్‌ ఉంటూనే విలక్షణతతో కూడిన సినిమా వీరిద్దరి నుంచీ రావొచ్చునట. అతి త్వరలో సినిమా పట్టాలెక్కనున్నట్లు తెలియవస్తోంది.