డబుల్‌ ధమాకా ఇవ్వనున్న జగపతిబాబు.

ఫ్యామిలీ హీరోగా హ్యాండ్‌సమ్‌ హీరోగా పేరు తెచ్చుకున్నాడు జగపతిబాబు. ‘లెజెండ్‌’ సినిమాతో తొలిసారిగా విలన్‌ పాత్రలో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఫుల్‌ బిజీ అయిపోయాడు. ‘పిల్లా నువ్వు లేని జీవితం’, ‘శ్రీమంతుడు’ ‘నాన్నకు ప్రేమతో’ వంటి సినిమాల్లో ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో కనిపించి సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్లిపోతున్నాడు. అయితే ఇప్పుడు మళ్లీ హీరో గెటప్‌ వేయాలనుకుంటున్నాడట. మాజీ కర్ణాటక సీఎం కుమారస్వామి జగపతిబాబు హీరోగా తెలుగులో ఒక సినిమా రూపొందించబోతున్నాడట. ఆ సినిమాకి జగపతిబాబు అయితే బావుంటుందని భావించి ఆయన్ని సంప్రదించగా, అందుకు జగపతిబాబు ఓకే చేయడం జరిగింది. నవంబరులో ఈ సినిమా సెట్స్‌ మీదికి వెళ్లనుంది.

 రీ ఎంట్రీలో జగపతిబాబు మెరిసిన గెడ్డం, అక్కడక్కడా మెరిసిన జుట్టుతో నేచురల్‌ హ్యాండ్‌సమ్‌గా కనిపిస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం మళ్లీ తన లుక్స్‌ టోటల్‌గా ఛేంజ్‌ చేయనున్నారు. ఇదివరకటి హ్యాండ్‌సమ్‌ హీరో గెటప్‌లోకి ఛేంజ్‌ అయిపోనున్నారట. అందుకోసం ఇప్పటికే జగపతిబాబు తన శరీర ధారుడ్యాన్ని మార్చుకున్నారనీ తెలుస్తోంది. హీరోగా హ్యాండ్‌సమ్‌ లుక్స్‌, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నేచరుల్‌ లుక్స్‌లో కనిపిస్తూ డబుల్‌ ధమాకా ఇవ్వనున్నారట ప్రేక్షకులకి జగపతిబాబు. ప్రస్తుతం కుమారస్వామి తనయుడు నిఖిల్‌ కుమార్‌ గౌడ హీరోగా వస్తోన్న ‘జాగ్వార్‌’ సినిమాలో జగపతిబాబు కీలకపాత్రలో నటిస్తున్నారు. హీరోగా జగపతి రీ-ఎంట్రీ అంటే సింప్లీ సూపర్బ్‌ అంతే.