జనతా గ్యారేజ్ రెండుసార్లు చూసేసిన రాజమౌళి

జనతా గ్యారేజ్ హంగామా మొదలయిపోయింది..నిన్న రాత్రంతా అభిమానులందరూ బెనిఫిట్ షోల దగ్గర చేసిన హుంగామ అంతా ఇంతా కాదు..తెల్లారే సరికే సినిమాకి సూపర్ హిట్ టాక్ వచ్చేసింది.అభిమానులతో పాటు సెలెబ్రిటీలు కూడా రాత్రంతా వేచి చూసి మరీ బెనిఫిట్ షోలు చూశారంటే సినిమా ఏ రేంజ్ హైప్ క్రియేట్ చేసిందో అర్థం చేసుకోవచ్చు.

ఇక ఏస్ డైరెక్టర్,ఎన్టీఆర్ జక్కన్నగా పిలుచుకునే రాజమౌళి కూడా జనతా గ్యారేజ్ బెనిఫిట్ షో ని హైదర్ నగర్ లోని భ్రమరాంబ థియేటర్ లో అభిమానుల మధ్య చూడ్డం విశేషం.ఎన్టీఆర్ తో రాజమౌళి ది ప్రత్యేక అనుబంధం.సినిమా చూసాక రాజమౌళి సినిమాపై ఎలా స్పందిస్తాడో అని అందరు ఎదురుచూసారు.

ఈ సినిమాకి ఎన్టీఆర్,మోహన్ లాల్ గారి మధ్యన ఉంటే ఇంటెన్సిటీ అబ్దుతం అన్నాడు
జక్కన్న.ఇంకా ఎన్టీఆర్ మోహన్ లాల్ గారు ఇద్దరూ పోటీపడి మరీ నటించారన్నాడు.ఇక తారక్ టెంపర్ మూవీ తరువాత పాత్రల ఎంపిక చూస్తుంటే గర్వాంగా ఉందన్నాడు జక్కన్న.ఇక తన ఫ్రెండ్ రాజీవ్ కనకాల చేసిన గవర్నమెంట్ క్లర్క్ పాత్ర హార్ట్ టచింగ్ గా ఉందన్నాడు.

ఇంకో విశేషమేంటంటే రాజమౌళి ఈ సినిమాని వరుసగా బ్యాక్ టు బ్యాక్ షోస్ చూసి మరీ ఎంజాయ్ చేసాడంటే సినిమా ఏ రేంజ్ లో జక్కన్నకి ఎక్కేసిందో తెలుస్తోంది.