ఎన్టీఆర్ నాగ చైతన్య మల్టీస్టారర్ కి రెడీ

యంగ్ టైగర్ ఎన్టీఆర్, అక్కినేని వారసుడు నాగ చైతన్య కలిసి ఒకే సినిమాలో నటించటానికి సిద్ధపడ్డారని టాలీవుడ్ సమాచారం అదికూడా అశ్వినీ దత్ నిర్మాణంలో. అశ్వినీ దత్ నిర్మాణంలో మహానటి సావిత్రి జీవిత కథతో ఒక సినిమా చిత్రీకరిస్తున్నసంగతి విదితమే.

అయితే సావిత్రి రీల్‌ లైఫ్‌లోనూ, రియల్‌ లైఫ్‌లోనూ ఎన్టీఆర్, ఎఎన్ఆర్ ప్రస్తావన తప్పకుండా ఉంటుంది. ఆమెతో వారికున్న బంధం అలాంటిది. అయితే ఇప్పుడు ఆ పాత్రలకు జూనియర్ ఎన్టీఆర్, నాగ చైతన్య లతో చేయించటానికి ప్రయత్నిస్తున్నాడట నిర్మాత అశ్వినీ దత్.

ఎన్టీఆర్ పాత్రలో నటించాల్సిందిగా జూనియర్‌ ఎన్టీయార్‌ను, ఏఎన్నార్‌ పాత్రలో నటించాల్సిందిగా నాగచైతన్యను చిత్ర నిర్మాత అశ్వనీదత్‌ అడిగారట. వారు కూడా ఈ చిత్రంలో కాసేపు అతిథి పాత్రల్లో కనిపించేందుకు సిద్ధమనే చెప్పారట. అదే జరిగితే సావిత్రి జీవిత కథ కు జీవం పోసినట్టవుతుంది.