‘ఎన్టీఆర్’ కి నచ్చనిది ‘బన్నీ’ కి నచ్చింది.

టాలీవుడ్ లో ఈ మధ్యకాలం లో కధా రచయితలు దర్శకులుగా మారి మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఆ దారిలోనే రావాలనుకుంటున్నాడు కథారచయితగా మంచి పేరు తెచ్చుకున్న వక్కంతం వంశీ. ఈయన స్టార్ హీరోల కథారచయితగా మంచి పేరు తెచ్చుకొన్నాడు. గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్ సినిమాకు వంశీ దర్శకత్వం వహించనున్నారు అనే వార్తలు వినిపించాయి.

అయితే ఇప్పుడు ఆ సినిమా పట్టాలెక్కేపరిస్థితి లేదని టాలీవుడ్ సమాచారం. ఎన్టీఆర్ ఇప్పుడు పూరి జగన్నాద్ తో ఒక సినిమా చేయటానికి రెడీ అవుతున్నాడట. దానివల్ల వక్కంతం వంశీ సినిమా ని పోస్టుపోన్ చేసాడంట. దీంతో ఇప్పుడు ఆ కథను అల్లు అర్జున్ కి చెప్పాడట వక్కంతం వంశీ. కథ చాలా డిఫరెంట్ నేపద్యంతో ఉండడంతో… బన్నీ కూడా అంగీకరించాడని టాలీవుడ్ టాక్. కాకపోతే ఇప్పుడు బన్నీ కూడా హరీష్ శంకర్ దర్శకత్వంలో “దువ్వాడ జగన్నాథం” సినిమా చేస్తున్నాడు. కాబట్టి బన్నీ కూడా కొన్నిరోజులు ఆగమన్నాడట. చూదాం వక్కంతం వంశీ అదృష్టం ఎలావుందో.