ఎన్టీఆర్,బన్నీ ఒకరి సినిమా లో ఒకరు

టాలీవుడ్ స్టార్ హీరోస్ లో ఎన్టీఆర్, బన్నీ వరుస విజయాలతో జోరుమీదున్నారు. అంతే కాకుండా ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ తో, బన్నీ సరైనోడు తో తమ కెరీర్ లోనే పెద్ద విజయాల్ని అందుకున్నారు. అయితే ఇప్పుడు వాళ్ళిద్దరికోసం కథలు రాసుకుని ఎదురుచూస్తున్న దర్శకులకు షాక్ ఇచ్చారు.

ఎన్టీఆర్ సినిమాతోనే దర్శకుడిగా పరిచయం కావాలని ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నాడు కథా రచయిత వక్కంతం వంశీ. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ ఆ సినిమా చేసేవుద్దేశంలో లేడట. దాన్తో వక్కంతం వంశీ అదే కథను బన్నీకి చెప్పాడట బన్నీకి కూడా కథ నచ్చటంతో సినిమా చేయటానికి అంగీకరించాడని సమాచారం.

అలాగే తమిళ డైరెక్టర్ లింగుస్వామి బన్నీ తో ఒక సినిమా చేయటానికి ప్లాన్ చేసుకున్నాడు. దానికి బన్నీ కూడా అప్పట్లో అంగీకరించాడని అయితే ఇప్పుడు బన్నీ దానిపై అంత ఇంట్రెస్టేడ్ గా లేడని సమాచారం. అయితే ఇప్పుడు అదేకథను లింగుస్వామి ఎన్టీఆర్ కి వినిపించాడట దానికి ఎన్టీఆర్ కూడా ఓకే చెప్పే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.