అమీజాక్సన్‌ యాక్షన్‌ స్టార్ట్స్‌

ముద్దుగుమ్మ అమీజాక్సన్‌ విక్రమ్‌ హీరోగా తెరకెక్కిన భారీ బడ్జెట్‌ మూవీలో డిఫరెంట్‌ కాస్ట్యూమ్స్‌లో డిఫరెంట్‌గానూ చాలా అందంగానూ కనిపించింది. దురదృష్టవశాత్తూ ఆ సినిమా ఆశించినంత విజయాన్ని అందుకోలేకపోయింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ రజనీకాంత్‌ హీరోగా వస్తోన్న ‘రోబో 2.0’లో హీరోయిన్‌గా నటిస్తోంది. ‘రోబో’లో హీరోయిన్‌గా నటించిన ఐశ్వర్యరాయ్‌ కోసం ఎలాంటి యాక్షన్‌ సీన్స్‌ డిజైన్‌ చేయలేదు శంకర్‌.

కానీ ఈ సీక్వెల్‌లో మాత్రం అమీజాక్సన్‌ కోసం కొన్ని యాక్షన్‌ సీన్స్‌ని ప్లాన్‌ చేస్తున్నాడట. ఆ సీన్స్‌లో నటించడం కోసం ముద్దుగుమ్మ అమీజాక్సన్‌ యాక్షన్‌లో శిక్షణ తీసుకుంటోందట. శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో విలన్‌ పాత్రలో బాలీవుడ్‌ యాక్షన్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన గెటప్‌ కూడా ఈ సినిమాలో చాలా డిఫరెంట్‌గా ఉండబోతోంది.

అక్షయ్‌ గెటప్‌కి సంబంధించి గతంలోనే ఒక లుక్‌ని కూడా విడుదల చేసింది చిత్ర యూనిట్‌. ఆ లుక్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. అక్షయ్‌ లుక్‌తో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా వస్తోన్న ఈ సినిమాకి సంబంధించి షూటింగ్‌ కార్యమ్రాలు శరవేగంగా జరుగుతున్నాయి. అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా రజనీకాంత్‌ ఇంతవరకూ షూటింగ్‌లో పాల్గొనని కారణంగా ఆయనకి సంబంధించిన సన్నివేశాలు మాత్రం పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారమ్‌.