మనం టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందుతున్నామేమో గాని మనుషులుగా మాత్రం నానాటికీ దిగజారిపోతూనే వున్నాం.దీనికి ప్రతి రోజు ఎదో ఒక ఉదాహరణ మనకు కనిపిస్తూనే ఉంటుంది.అయితే భారత దేశమంతా గర్విస్తున్న భరతమాత ముద్దు బిడ్డ పూసర్ల వెంకట సింధు అసలు విజయాన్ని ఆస్వాదించక ఆమె స్థానికత పైన ఆరాలు రాజకీయాలు చేయడం నిజంగా కుసంస్కారం.
అవును సింధు ఒలిపిక్స్ బ్యాట్మింటన్ లో ఫైనల్స్ కి చేరిన దగ్గరి నుండి ఒక్క మన తెలుగు ప్రజలే కాదు యావతా భారత దేశమంతా సింధు గురించి గూగుల్ లో తెగ వెతికిన విషయం తెలిసిందే.అయితే అందరిలా వెతికితే మనం తెలుగు వాళ్ళమెందుకవుతాము…అందుకే సింధు క్యాస్ట్ గురించే అత్యధికమంది సెర్చ్ చేయడం మనుషులుగా మనం ఎంత వెనక్కి వెళ్తున్నామో అద్దం పడుతుంది.
ఇక సింధు నిన్న తెలంగాణ సర్కార్ చరిత్రలో ఎప్పుడులేనటువంటి అఖండ స్వాగతం పలికి సన్మానించిన దగ్గరినుండి అసలు సింధు ది ఆంధ్ర నా తెలంగాణా నా అనే ఒకటే చర్చ.నిజంగా సిగ్గుపడాలి మనమంతా..ఎవరైతేనే ఆమె ప్రాతినిధ్యం వహించింది భారత దేశానికే కానీ ఏదో ఒక రాష్ట్రానికి కాదు.ఎవరి ఆత్రుత వాళ్ళది..ఎవరి స్వప్రయోజనాలు వాళ్ళవి.
ఇదే విషయాన్నీ ఈ రోజు విజయవాడలో జరిగిన సింధు సన్మాన కార్యక్రమంలో కోచ్ గోపీచంద్ దిమ్మతిరిగే సమాధానం చెప్పాడు.సింధు ఒక ఇండియన్ అంతే అనడం తో సమాధానం కోసం వేచి చూస్తున్న వారి గొంతులో వెలక్కాయ పడింది.ఇక సింధు ఈ విషయం పై స్పందిస్తూ తాతగారిది విజయవాడే అని చిన్నప్పుడు సెలవుల్లో ఇక్కడికే వచ్చేదాన్ని అనడంతో ఈ కుసంస్కారులు అప్పుడే పిచ్చి రాతలు మొదలుపెట్టేశారు.సింధు ది ఆంద్రానే అని..కాదు కాదు సింధు పుట్టి పెరిగిందంతా తెలంగాణాలో కాబట్టి ఆమె ముమ్మాటికీ తెలంగాణా బిడ్డే అని..ఛీ ఛీ..అసలైన విజయాన్ని ఆస్వాదించక భరతమాత ముద్దుబిడ్డకి స్థానికతని ఆపాదించే ప్రయత్నం చేయడం సిగ్గుచేటు.