సవాల్ విసురుతున్న తమన్నా డాన్స్

తెలుగు హీరోయిన్స్ లో బెస్ట్ డాన్సర్ ఎవరా అంటే ముందుగా వినిపించే పేర్లు తమన్నా,శృతిహాసన్ పేర్లే.వీరిలో తాజాగా మెరుపు తీగ తమన్నా ఇరగ దీసింది.చాలా రోజుల తర్వాత.. స్టెప్పులతో దుమ్ములేపింది.టాప్ హీరోలకే తన డాన్స్ తో సవాల్ విసిరింది మిల్కీ బ్యూటీ.

గతం లో ఎన్టీఆర్ ,రాంచరణ్,అల్లు అర్జున్ వంటి బెస్ట్ డాన్సర్స్ తో స్టెప్పులేసి శభాష్ అనిపించుకున్న తమన్నా తాజాగా అభినేత్రి సినిమాలో ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా మెప్పు పొందింది.లేటెస్ట్ గా రిలీజ్ అయినా అభినేత్రి టీజర్ లో తమన్నా డాన్స్ చూసి ఎవరైనా వావ్ అనాల్సిందే.

Click Here For Dance Teaser

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ కానున్న అభినేత్రి మూవీ లేటెస్ట్ టీజర్ ను విడుదల చేసింది సినిమా యూనిట్. ఈ టీజర్ లో తమన్నా స్టెప్పులు కేక పుట్టిస్తున్నాయి. కోన వెంకట్ సమర్పణలో.. విజయ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీకి.. సాజిద్-వాజిద్, జీవీ ప్రకాశ్ , విశాల్ .. మ్యూజిక్ అందిస్తున్నారు.