అల్లు శిరీష్‌ లావణ్య కెమిస్ట్రీ అదుర్స్‌ 

పరశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. అల్లు శిరీష్‌, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్నారు ఈ సినిమాలో. వీరిద్దరి పెయిర్‌ చాలా బాగుందని ప్రశంసిస్తున్నారు అంతా. అంతేకాదు సినిమాలో వీరిద్దరికీ మధ్య కెమిస్ట్రీ కూడా బాగా కుదిరిందట. ఇప్పటికే విడుదలైన టీజర్స్‌తో బాగా ఎట్రాక్ట్‌ చేస్తున్నారు ఈ ముచ్చటైన జంట.

గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లో అల్లు అరవింద్‌ నిర్మాతగా రూపొందుతోన్న ఈ సినిమా ఈ శుక్రవారం విడుదలవుతోంది. ‘ఆంజనేయులు’, సోలో’ సినిమాల్లో టైమింగ్‌ ఉన్న కామెడీతో ఆకట్టుకున్న పరశురామ్‌ ఈ సినిమాతో కూడా మంచి వినోదాన్ని పంచనున్నాడట. ఫ్యామిలీ మొత్తం కలిసి చూడగలిగే మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ మూవీగా ఈ సినిమాని రూపొందించారు. అన్ని రకాల ఎమోషన్స్‌ని చాలా చక్కగా తెరకెక్కించారట ఈ సినిమాలో.

సీనియర్‌ నటీ నటులతో పోటీగా శిరీష్‌ నటన ఉండబోతోందట. నటన పరంగా ఈ సినిమా శిరీష్‌కు చాలా మంచి సినిమా అవుతుందని చిత్ర యూనిట్‌ భావిస్తోంది. లావణ్య నటన ఈ సినిమాలో కొత్తగా ఉండబోతోందట. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాలో లావణ్య శారీల్లో అందంగా కనిపిస్తుంది. అంతకన్నా అందంగా ఈ సినిమాలో చూపించారట డైరెక్టర్‌ ముద్దుగుమ్మ లావణ్యని. వరుస విజయాలతో ఆకట్టుకుంటోన్న ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకునేందుకు రెఢీ అవుతోంది.