వాళ్ల ఆనందం కోసం తప్పదంటున్న తమన్నా

మారిపోవాలి… మారి పోవాలి… అన్నీ మారి పోవాలంటున్నారు తమన్నా. ఇంతకీ ఏం మారిపోవాలి అను కుంటున్నారో తెలుసా? చాలా సింపుల్. ఆరోగ్యంగా, సన్నగా ఉండటం కోసం తీసుకునే ఆహారం మారి పోవాలను కుంటున్నారు? అసలేంటి తమన్నా సమస్య? మరేం లేదు. హీరోయిన్లు 50 కేజీల నుంచి 55 లోపు బరువు ఉంటారు.

బరువు తగ్గకుండా, పెరగకుండా ఉండటం కోసం ఆహారం పరంగా కొన్ని నియమాలు పెట్టుకుంటారు. ఆ విషయం గురించి తమన్నా మాట్లాడుతూ – బరువు పెంచే ఫుడ్ఐటమ్స్‌ని దగ్గరకు రానివ్వనండి. ఒక్కోసారి మాత్రం మనసు వాటి వైపు లాగేస్తుంటుంది. ఉదాహరణకు మొన్నా మధ్య నేను వెజిటెబుల్ సలాడ్ తింటున్నాను. కాస్త దూరంలో ఎవరో డోనట్ తింటూ కనిపించారు. అది చాక్లెట్ డోనట్. నాకు ఏ రేంజ్‌లో నోరూరిందంటే.. నా ప్లేటులో ఉన్న సలాడ్ మొత్తం డోనట్‌లా మారిపోతే బాగుండు అనిపించింది.

అది మాత్రమే కాదు.. ఓట్స్, మొలకెత్తిన గింజలు అలాంటివి తింటున్నప్పుడు కూడా అవి ఫ్రెంచ్ ఫ్రైస్‌లానో, పూరీల్లానో మారిపోతే బాగుంటుందనిపిస్తుంటుంది. ఆ క్షణంలో అలా అనిపించినా ఆ తర్వాత మాత్రం ఆడియన్స్ మనల్ని చూసి ఆనందపడతారు కదా. వాళ్ల ఆనందం కోసం టేస్టీ ఫుడ్‌ని త్యాగం చేయొచ్చు అనుకుంటా అని చెప్పారు.