రోబో 2.0 రజిని ఉన్నట్టా లేనట్టా?

సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో శంకర్ తెరకెక్కిస్తున్న ‘రోబో 2.0’ షూటింగ్ శరవేగంగా సాగిపోతోంది. అయితే.. లీడ్ యాక్టర్.. రజనీ మాత్రం చిత్రీకరణకు దూరంగానే ఉన్నారు. సెప్టెంబర్‌లో ఆయన షూటింగ్‌లో పాల్గొంటారని తెలుస్తోంది. నెలరోజులకు పైగా అమెరికానే ఉన్న రజనీ ఇప్పటికీ రెస్ట్ తీసుకుంటూనే ఉన్నారని సమాచారం.

తలైవా లేకపోయినా.. శంకర్ మాత్రం.. ఎక్కడా వెనకడుగు వేయడంలేదు. రజనీ లేని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడు. ఎడిటింగ్ పని కూడా ప్రారంభించేశాడని చెప్పుకుంటున్నారు. దీంతో.. ‘రోబో 2.0’టీజర్ త్వరలోనే రిలీజ్ కావచ్చన్న ఊహాగానాలు కూడా ఊపందుకున్నాయి.2010లో వచ్చిన ‘రోబో’కు కొనసాగింపుగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రంలో రజనీ సరసన ఇంగ్లీష్ బ్యూటీ అమీ జాక్సన్ నటిస్తోంది. బాలీవుడ్ యాక్షన్ స్టార్ అక్షయ్ కుమార్ విలన్‌గా నటిస్తున్నారు.