రజనీకాంత్ హిట్ టు కిల్ వారి పనే!

సూపర్ స్టార్ రజినీకాంత్ అధికారిక ట్విట్టర్ అకౌంట్ చుసిన అభిమానులకి కొద్దిసేపు గుండె ఆగినంత పనయింది.’రజనీకాంత్ హిట్ టు కిల్’ అనే పోస్ట్ రజిని ట్విట్టర్ అకౌంట్ లో రావడం తో ఒక్క సారిగా అభిమానులే కాదు యావత్ దేశం అంతా ఉలిక్కి పడింది.

అయితే రజిని ట్విట్టర్ అకౌంట్ ని ఎవరో హాక్ చేసి ఆ ట్వీట్ ని పెట్టినట్టు రజిని కుమార్తె ఐశ్వర్య వివరణ ఇవ్వడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.వెంటనే రజిని ట్విట్టర్ ఖాతాని పునరుద్దరించామని ఇప్పుడంతా సవ్యంగా ఉందని ఐశ్వర్య వివరినిస్తూ అందరికి ధన్యవాదాలు తెలిపారు.

ట్విట్టర్ లో సూపర్ స్టార్ ని 30 లక్షల పైగా ఫాలో అవుతున్నారు.అయితే రజిని మాత్రం కేవలం 23 మందిని మాత్రమే ఫాలో అవుతుండడం గమనార్హం.వీరిలో కూతురు ఐశ్వర్య,అల్లుడు ధనుష్,అమితాబచ్చన్ ,రెహ్మాన్,ప్రధాని మోడీ మాత్రమే వ్యక్తులు కాగా మిగిలినవన్నీ న్యూస్ పేపర్ అకౌంట్స్.