రజని దెబ్బకి అల్లడుతున్నారట

తెలుగు నాట లక్ష్మీగణపతి ఫిలిమ్స్ తెలియని వాళ్ళుఉండరు ఎందుకంటే ఒకప్పుడు ఏ డబ్బింగ్ సినిమా వచ్చినా ఇంటింటా ప్రతి టీవీ ఛానల్ లో యాడ్స్ తో అదరగొట్టేసేవాళ్ళు అంత సూపర్ ఫేమస్ అయిన లక్ష్మీగణపతి ఫిలిమ్స్ కొన్నేళ్లుగా ఆ సంస్థ కనబడకపోవటానికి కారణమేమిటో తెలుసా …

రజనీకాంత్‌ సినిమా ‘కొచ్చాడయాన్‌’ తెలుగు డబ్బింగ్‌ రైట్స్‌ కొని వారు పెద్ద తప్పే చేశారు. ఆ సినిమా మిగిల్చిన నష్టాలకి ఇప్పటికీ వారు కోలుకోలేదు. ఆతర్వాత వచ్చిన లింగా కూడా బయ్యర్స్ కి నష్టాలే మిగిల్చింది ఇప్పుడు వచ్చిన కబాలి కూడా అంతే.

భారీ హైప్‌తో విడుదల చేసిన ఈ చిత్రం ఘోరమైన అపజయాన్ని మూటగట్టుకుంది. సూపర్‌హిట్‌, రికార్డ్‌ కలెక్షన్లు అంటూ పైకి చెప్పుకుంటున్నా.. బయ్యర్లను మరోసారి ముంచేశాడు రజనీ. తమిళనాడులో మాత్రమే కొంచెం తక్కువ నష్టాలు వచ్చాయి. మిగిలిన ప్రాంతాల డిస్ట్రిబ్యూటర్స్ కి మాత్రం భారీ నష్టాలని మిగిల్చింది.
ఈ సినిమా ప్రభావం ‘రోబో-2’ పై కచ్చితంగా పడే అవకాశాలున్నాయంటున్నారు విశ్లేషకులు. రజని వరుస ప్లాప్ లు, శంకర్ ‘ఐ ‘ పరాజయం కారణంగా ఈసారి తెలుగు బయ్యర్లు ఆచి తూచి అడుగులేస్తున్నారని టాక్.