మెగా వారసుడు కి చిట్టి చెల్లి రక్షాబంధన్

మెగా వారసుడు రాఖీ కట్టించుకున్నాడు అందులో విశేషమేముంది అనుకుంటున్నారా ? నిజంగానే విశేషం వుంది రాఖీ పండగ రోజు తన సొంత సోదరీమణులతోపాటు రాఖీ కట్టించుకున్న ఈ మెగా హీరో తన బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – అన్నా ల గారాల పట్టి పోలేనా తో కూడా రాఖీ కట్టించుకున్నాడు ఈ విషయమే ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా చక్కెర్లు కొడుతుంది. రాఖీ కట్టించుకున్న చరణ్ చెల్లి పోలేనా కి ఏం కనుక ఇచ్చాడనేది మాత్రం సస్పెన్స్ గానే ఉండిపోయింది. అయితే చరణ్ అన్నకి రాఖీ కట్టిన పోలేనా తన సొంత అన్న అఖీరా కి కట్టినదా లేదా అని మెగా అభిమానుల్లో చర్చ నడుస్తోంది.