మెగా వారసుడిని మెగా ఫామిలీ దూరం పెడుతుందా!

టాలీవుడ్ లో వారసుల ఎంట్రీ చాల ఘనంగా ఉంటుంది. ముఖ్యంగా టాప్ హీరోస్, టాప్ ప్రొడ్యూసర్స్ వారసుల ఎంట్రీ గురించయితే వేరే చెప్పనక్కర్లేదు. కానీ టాలీవుడ్ అగ్రహీరో వారసుడి ఎంట్రీ మాత్రం ఎటువంటి హడావుడి లేకుండానే జరగనుంది. ఆ అగ్రహీరో పవన్ కళ్యాణ్ ఆ వారసుడు అకీరా నందన్ తేజ్.

మెగా ఫామిలీ నుంచి వచ్చే ప్రతిఒక్కరి ఎంట్రీ చాల ఘనంగానే ఉంటుంది. అటువంటిది పవన్ కళ్యాణ్ వంటి అగ్రహీరో అదికూడా మెగా ఫ్యామిలీలో చిరంజీవి తరవాత టాప్ హీరో అయిన పవన్ కళ్యాణ్ కుమారుడి ఎంట్రీ గురించి మాత్రం ఒక్కరుకూడా మాట్లాడటం లేదని, అఖీరా సినీ ఎంట్రీ గురించి ఒక్క వార్త కూడా ఎందుకు కనిపించటం లేదని పవర్ స్టార్ అభిమానులు చర్చించుకుంటున్నట్లు ఫిలింనగర్ టాక్.

ఈ మెగావారసుడికి మెగాఫ్యామిలీ కావాలనే దూరంగా ఉంటుందా లేకపోతే అఖీరా ఎంట్రీ కి మెగాఫ్యామిలీ ఏదయినా భారీగా ప్లాన్ చేస్తుందా అని మెగా అభిమానులు చర్చించుకుంటున్నారు. ఇదంతా ఎందుకంటే రేణుదేశాయ్ దర్శకత్వం లో అఖీరా నటించిన మరాఠి చిత్రం ‘ఇష్క్ వాలా లవ్’ త్వరలో విడుదల కానుంది.