మూడు లిప్ కిస్సులు అయినా కట్ లేదు!

హృతిక్‌రోష‌న్ న‌టించిన మొహంజొదారో సినిమాలో ఘాటైన మూడు ముద్దు సీన్లున్నా సెన్సార్ బోర్డు ఏమాత్రం అభ్యంతరం చెప్పలేదు. అంతే కాదు సినిమా రిలీజ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒక్క క‌ట్ కూడా లేకుండానే క్లియ‌రెన్స్ ఇచ్చేసింది. ఇలాంటి సీన్లే ఉన్న చాలా సినిమాలకు అభ్యంతరం చెప్పిన బోర్టు.. మొహంజొదారో సినిమాకు మాత్రం క్లియరెన్స్ ఇవ్వడంపై బాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది.

ఈ కిస్ సీన్లపై స్పందించిన హీరోయిన్ పూజా హెగ్డే.. ‘దాన్నో ముద్దుగా చూడలేదు. ఓ మామూలు సీన్ చేసినట్లు చేశాం. ఎప్పుడు ముద్దు పెట్టుకోవడం ప్రారంభించామో.. ఎప్పుడు ముగించామో తెలియలేదు. నేనేం సిగ్గుపడలేదు. బెస్ట్ ఆన్‌స్క్రీన్ కిస్‌లలో ఇది ఒకటిగా నిలుస్తుంది’’ అని తెలిపింది.

ప్రముఖ ద‌ర్శ‌కుడు అశుతోష్ గోవారిక‌ర్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. సిద్ధార్థ్ రాయ్‌క‌పూర్ నిర్మాత‌గా ఉన్నారు. సింధు లోయ నాగ‌రిక‌త ప్ర‌ధానాంశంగా నిర్మించిన ఈ సినిమా… ఆగ‌స్టు 12న రిలీజ్ కానుంది.