మిల్కీ బ్యూటీతో చైతూ మళ్ళీనా?

మిల్కీ బ్యూటీ తమన్నాతో ఇంకో సినిమా చేయనున్నాడు అక్కినేని నాగచైతన్య. ‘సోగ్గాడే చిన్నినాయనా’ ఫేం కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా తెరకెక్కనున్న సినిమాకి తమన్నాని హీరోయిన్‌గా ఎంపిక చేశారట. ముందుగా ఈ సినిమాలో హీరోయిన్‌గా సమంత పేరుని ఎంపిక చేసినట్లు వార్తలొచ్చాయి. అయితే ఆ ప్లేస్‌లోకి తమన్నా వచ్చిందని తెలియవస్తోంది.

తమన్నా, నాగచైతన్య ఇప్పటిదాకా చేసిన రెండు సినిమాలూ హిట్లే. అందులో ఒకటి ‘100 పర్సంట్‌ లవ్‌’ కాగా, ఇంకొకటి ‘తడాఖా’. మూడోసారి ఈ కాంబినేషన్‌ రిపీట్‌ అవుతుండడంతో ఇది హ్యాట్రిక్‌ హిట్‌ అయ్యే అవకాశం ఉంది. అన్నపూర్ణా బ్యానర్‌లో అక్కినేని నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తారట. ప్రస్తుతం నాగ చైతన్య ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మరో సినిమా ‘ప్రేమమ్‌’ చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఈ రెండు సినిమాలు ఒకేసారి కొన్ని నెలల తేడాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ లోపల చైతూ కొత్త సినిమా పట్టాలెక్కనుంది.

మరో పక్క తమన్నా ‘బాహుబలి ది కన్‌క్లూజన్‌’, ‘అభినేత్రి’ సినిమాలతో బిజీగా ఉంది. ‘బాహుబలి’కి ముందు తమన్నా కెరీర్‌ కొంచెం డల్‌ అయినా ఇప్పుడు జెట్‌ స్పీడ్‌లో దూసుకుపోతోంది. వరుస ఆఫర్లతో తమన్నా డైరీ అస్సలేమాత్రం ఖాళీగా లేదట. ఏదేమైనా చైతూతో మిల్కీ బ్యూటీ ఆన్‌ స్క్రీన్‌ కెమిస్ట్రీ ఇంకోసారి కెవ్వు కేక అన్పించడం ఖాయంగానే కన్పిస్తోంది కొత్త సినిమాలో.