బోండా బాబూ ఏమిటీ డ్రామాలు

రాజకీయాల్లో ఇంకా ఎన్నెన్ని చూడాల్సి వస్తుందో అని తెలుగు ప్రజలకి అనుమానం ఉన్నమాట వాస్తవం..గతం లో ఎన్నడూ చూడనన్ని ఘోరమైన రాజకీయాలకు మనమే సాక్ష్యంగా నిలిచాము.పొద్దున్నే టీడీపీ ఎంపీ టీజీ గారు ప్రెస్ మీట్ పెట్టి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై దుమ్మెత్తి పోసాడు.తమిళనాడు లో అయితే జయలలిత కాళ్ళు చేతులు విరగ్గొట్టేది అని,రాజకేయాలంటే గడ్డం గీసుకోవడం కాదు లాంటి పరుషమైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డాడు.

ఆ వెర్షన్ అయింది..ఏమనుకున్నారో ఏమో టీడీపీ అధినాయకత్వం..అరరె ఇది ఎటెల్లి ఎటుస్తుందో అనుకుందో ఏమో..వెంటనే దిద్దుబాటు చర్యల్ని చేపట్టింది..బోండా ఉమా గారు ప్రెస్ మీట్ పెట్టి తమ పార్టీ ఎంపీ గారి మీదే విమర్శలు గుప్పించారు.పవన్ కళ్యాణ్ మీద అలాంటి వ్యాఖ్యలు చేయకూడదు..ఆయన చాలా మంచోడు..మనం మనం ఒకటే…మనదంతా మిత్రపక్షం..నువ్విలా ఇంకా కాంగ్రెస్సోడిలా మాట్లాడకూడదు..మనది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అంటూ గీతోపదేశం చేసాడు.

అయినా ఇలాంటి విడ్డూరం ఎక్కడా చూసుండరు.ఒకే పార్టీ లో రెండు బద్ద వ్యతిరేక వైఖరులు.ఇంకా అర్థం కాలేదా.పొద్దున్నేమో పవన్ వ్యతిరేకుల కోసం ఒకాయనతో డ్రామా ఆడించారు..అది సక్సెస్..ఇక పవన్ అభిమానులకి క్లైమాక్స్ గట్టిగా ఉండాలి కాబట్టి బోండా గేమ్ షో సాయంత్రం ఆడించారు.అదీ అసలు విషయం మరి..ఎక్కడయినా రెండుకళ్ల సిద్ధాంతాన్ని మాత్రం టీడీపీ విడువడు గాక విడువడు.