బాలయ్య కెరీర్ లో శాటిలైట్ రికార్డ్

గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాను రూ.70 కోట్ల బడ్జెడ్‌తో తీస్తున్నారంటే ముందు అది రూమరే అనుకున్నారు. ఎందుకంటే బాలయ్య కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అయిన ‘లెజెండ్’ వసూలు చేసింది రూ.40 కోట్లే. మ‌రి అంత బ‌డ్జెట్ పెట్టిన క్రిష్ నిండా మునిగిపోతాడేమో అని కంగారు ప‌డ్డారంతా. కానీ క్రిస్ అన్ని లెక్క‌లూ వేసుకునే రంగంలోకి దిగాడ‌ని ఇప్పుడిప్పుడే అర్థ‌మ‌వుతోంది. విడుద‌ల‌కు ఇంకా ఐదు నెల‌లుండ‌గానే ఈ చిత్రానికి మంచి బిజినెస్ ఆఫ‌ర్లు వ‌స్త‌న్నాయి. అన్ని ఏరియాల్లోనూ బాల‌య్య కెరీర్లో రికార్డు రేటుకు హ‌క్కులు కొన‌డానికి బ‌య్య‌ర్లు ముందుకొస్తున్న‌ట్లు స‌మాచారం. ఇక ‘గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి’ శాటిటైల్ రైట్స్ ఇప్పటికే భారీ ధ‌ర‌కు అమ్ముడ‌య్యాయి.

              శాటిలైట్ హ‌క్కుల్ని రూ.9 కోట్ల‌కు సొంతం చేసుకుంద‌ట మాటీవీ. ఇది బాల‌య్య కెరీర్లో హైయెస్ట్. ఇంత‌కుముందు ‘లెజెండ్ సినిమా శాటిలైట్ రైట్స్ రూ.7.5 కోట్ల దాకా ప‌లికాయి. ‘గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి’ బిజినెస్ కూడా ఓ రేంజిలో జ‌రిగే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. సినిమా విష‌యంలో క్రిష్ అస‌లేమాత్రం రాజీ ప‌డ‌ట్లేదు. నటీనటులు.. టెక్నీషియన్స్ విషయంలో కానీ.. షూటింగ్ విషయంలో కానీ.. అసలేమాత్రం రాజీ కనిపించట్లేదు. 20 రోజుల తొలి షెడ్యూల్‌కే రూ.8 కోట్లు ఖ‌ర్చుపెట్టాడు. యాక్షన్ సీక్వెన్స్.. విజువల్ ఎఫెక్టుల కోసం హాలీవుడ్ నిపుణుల సాయం తీసుకుంటున్న క్రిష్.. అటు స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ‌కు.. ఇటు గ్రాఫిక్స్ విజువ‌ల్ ఎఫెక్టుల‌కు భారీగా ఖ‌ర్చు చేస్తున్నాడు.