పెళ్లిచూపుల‌కు కోసం సల్మాన్ ఖాన్ రెడీ !

తెలుగు సినిమాల‌పై బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ మ‌న‌సు పారేసుకున్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. ఇదివ‌రకే పోకిరి, రెడీ,కిక్ లాంటి హిట్ చిత్రాల‌ను హిందీలో రీమేక్ చేసి స‌క్సెస్ సాధించిన ఈ భ‌జ‌రంగీ భాయిజాన్ క‌ళ్లు తాజాగా పెళ్లిచూపులు చిత్రంపై ప‌డ్డాయి.

పెళ్లి చూపులు రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకోవ‌డంతో ఈ సిన్మాపై స‌ల్మాన్‌ఖాన్ ఆలోచిస్తున్న‌ట్లు స‌మాచారం. ఇందులో భాగంగానే సీనియ‌ర్ నిర్మాత ద‌గ్గుబాటి సురేష్ బాబు స‌ల్మాన్ కోసం ఓ స్పెష‌ల్ స్క్రీనింగ్‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

అయితే ఈ లోబ‌డ్జెట్ మూవీలో స‌ల్మాన్ న‌టిస్తాడా లేదా అనేది మాత్రం స‌స్పెన్స్‌గానే ఉంది. ఒక‌వేళ న‌టించ‌కుంటే.. సినిమా హ‌క్కుల‌ను కొంటాడ‌నే టాక్ వినిపిస్తోంది.