పవర్ స్టార్ కీ ఓ సెంటిమెంట్ వుంది!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొత్త సినిమా ఈ నెల 6 నుండి మొదలవుతున్న సంగతి తెలిసిందే. గోపాల గోపాల ఫేమ్ డాలి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్. ఇదిలా ఉంటే, ఈ చిత్రం షూటింగ్ శనివారం నుంచే ప్రారంభమైపోతోంది. అయితే.. పవన్ మాత్రం చిత్రీకరణకు దూరంగా ఉంటారట.

సెంటిమెంటో ఏమో కానీ.. సాధారణంగా పవన్ కల్యాణ్.. తన కొత్త చిత్రం ప్రారంభమైన వారంరోజుల తరువాతే షూటింగులో పాల్గొంటారని సన్నిహితులు అంటున్నారు. మొదటి షెడ్యూల్ కు రాకపోవడం ఆయనకు సెంటిమెంట్ గా మారిందట. ఖుషీ.. గబ్బర్ సింగ్ సినిమాలకు కూడా మన పవర్ స్టార్ మొదటి వారం షూటింగ్ కు గైర్హాజయ్యారట. ఈ సెంటిమెంట్స్ సంగతెలా ఉన్నా.. పవన్ మరోసారి ఫామ్ లోకి వచ్చేసి ఓ బ్లాక్ బస్టర్ ఇచ్చేస్తే.. అభిమానులకు పండగే. ఈ కొత్త మూవీ హిట్ అయితే సినీ పరిశ్రమ సైతం లాభపడుతుంది. వందల కుటంబాలకు ఆర్ధికభారం తగ్గుతుంది.