ధర్మానా ఇదేమి ధర్మం

మన పిచ్చిగాని..రాజకీయాల్లో ధర్మాధారామాలు..నీతి నిజాయితీ లాంటి పదాలు మాట్లాడకూడదనే రోజులొచ్చేశాయి..నిస్సిగ్గుగా ఎన్నికలయిన మరుక్షణమే పార్టీలు ఫిరాయిస్తున్నారు..ఫిరాయింపుకు పది మార్గాలు అన్న చందాగా ఒక్కరు ఒక్కో దారిలో పార్టీ ఫిరాయిస్తున్నారు..అయితే అందరికీ కామన్ గా వుండే విషయం ఒక్కటే..అందరూ..ఫిరాయించడానికి కొద్దీ రోజుల ముందు నుండి సొంత పార్టీ పై నిరసన గళం విప్పడమో..మౌనం వహించడమే చేయడం..మూన్నాళ్ళకు పార్టీ ఫిరాయించేసి..అభివృద్ధి కోసమే..ప్రజా సంక్షేమమే కోసమే అధికార పార్టీ లో చేరామని బొంకడం షరా మామూలయిపోయింది.

ఈ ఉపోద్గాత్తమంతా ఎందుకంటే తాజాగా వైసీపీ లో శ్రీకాకుళం బడా నేత ధర్మాన ప్రసాద్ రావు పై వస్తున్న వార్తలు చూస్తుంటే ధర్మాన కూడా టీడీపీ లోకి వలస వెళ్లే పక్షేనా అన్న అనుమానం కలగక మానదు.శ్రీకాలం వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ధర్మాన సంచలన వ్యాఖ్యలు చేశాడంటూ కొన్ని పత్రికలూ ప్రధానంగా ప్రచురించాయి.జగన్ కడపలో గెలవడం లో గొప్పేముంది.శ్రీకాకుళం నుండి జగన్ గెలవడం కష్టమే అంటూ ధర్మాన తీవ్ర వ్యాఖ్యలు చేశాడంటూ పత్రికా కథనాలొస్తున్నాయి.

అంతేనా..కడప నుండి నేను పోటీ చేసినా గెలుస్తా..కడపలో కుల,మత సమీకరణాలు అలా వున్నాయి..వైసీపీ కి అండగా 6 జిల్లాల్లో మాత్రమే కుల సమీకరణాలున్నాయి.మిగిలిన జిల్లాల్లో కుల సమీకరణాలు అంత అనుకూలంగా లేదు.అదే నేను టీడీపీ తరపున శ్రీకాకుళం నుండి పోటీ చేస్తే తప్పకుండా గెలుస్తా అనడం కొసమెరుపు.

అయితే ఈ విషయం పై వైసీపీ నష్ట నివారణకు రంగంలోకి దిగి ధర్మానను వివరణ కోరినట్టు తెలుస్తోంది.తాజగా ధర్మాన ఇదే విషయమై పత్రికా ముఖంగా ఖండించారు.వైఎస్ ఫామిలీ కి నన్ను దూరం చేసే కుట్ర జరిగుతోంది..కొన్ని పత్రికలూ పనిగట్టుకుని తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని ధర్మాన ఆరోపించాడు.14 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న టీడీపీ.. శ్రీకాకుళం జిల్లాకు ఒక్కటంటే ఒక్కటి కూడా శాశ్వత పథకాన్ని ఇవ్వలేదని ధర్మాన విమర్శించారు.

ఇదంతా ఫిరాయింపులు స్క్రీన్ ప్లే మాదిరిగానే వుండడంతోనే అసలు అనుమానాలకు తావిస్తోంది.ఇప్పటి వరకు పార్టీ ఫిరాయించిన వారిలో దాదాపుగా అందరూ ఇదే తరహా స్క్రిప్ట్ ఫాలో అవ్వడం ధర్మాన ఫిరాయింపు పైనా అనుమానాలకు తావిస్తోంది.మీడియా లో మొదట కథనాలు రావడం..దాని తరువాత ఆబ్బె అదేం లేదు అని మన నాయకులు ఖండించడం..కట్ చేస్తే 3-4 రోజుల్లో అవతలి పార్టీ తీర్థం పుచ్చుకుంటూ కెమెరాకు ఫోసులివ్వడం మనకు బాగా అలవాటైన డైలీ సీరియల్ కదా.