థాంక్స్ పవన్ కళ్యాణ్:నాని

జనసేన అధ్యక్షుడు ఎప్పుడూ పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడినా లేకపోతే మీడియా ముందుకొచ్చినా కొంతమందిని వ్యక్తుగతంగా టార్గెట్ చేస్తుంటారు.వాళ్లలో ముక్యంగా ఉండేది టీడీపీ విజయవాడ ఎంపీ,కేశినేని ట్రావెల్స్ ఓనర్,కేశినేని నాని.మొన్నామధ్య తిరుపతి బహిరంగ సభలో కూడా పవన్ కేశినేని పేరును ప్రస్తావించారు.మన ఎంపీలందరూ బాగా డబ్బున్నోళ్లే,కోటీశ్వరులు,వాళ్లలో ముక్యంగా అంటూ కేశినేని పేరుని పవన్ ప్రస్తావించడం తెలిసిందే.

అయితే ఈ విషయంపై నాని స్పందిస్తూ..పవన్ కి ఇదేం కొత్తేమి కాదు..పాపం ఎప్పుడూ తనని తలుస్తునే ఉంటాడు.దీనిపై నాకేం కోపం లేదు.ఇంకా చెప్పలంటే పవన్ కి థాంక్స్.ఎందుకంటే నన్ను ప్రజలకి గుర్తుచేశాడు.నాకు ఫ్రీ పబ్లిసిటీ అని నాని చెప్పుకొచ్చాడు.అయినా పవన్ వ్యాఖ్యలపై నాని చాలా రిలాక్స్డ్ గా కూల్ గా స్పందించడం ఆర్చర్యమేసింది.ఈ నానీయేనా మొన్నామధ్య విజయవాడలో గుళ్ళు కూల్చేసేటప్పుడు..ఏడ్చేయండ్రా,తోసేయండ్రా అంటూ అర్చకులపై దుర్బాషలాడింది అని అనుమానం రాక మానదు.

నాని గారికి ఈ రియాక్షన్ అంతగా సూట్ అవ్వలేదు.ఎంతైనా అతికించుకున్న రియాక్షన్ కదా అలాగే ఉంటుంది మరి..ఒరిజినల్ వేరే ఉంది నాని లోపల.కాకపోతే పవన్ కి థాంక్స్ చెప్పడం బానే ఉంది కానీ..పవన్ ఇంతకుముందు ఇదేమాదిరిగా జపించిన కాంగ్రెస్ కురువృద్దుల పేర్లెమయ్యాయో తెలుసుగా..అదే నాని గారూ మన జై రామ్ రమేష్ గారు..వీరప్ప మొయిలీ గారు..గులాం నబి ఆజాద్ గారు ఖాళీగా కూర్చొని గోళ్లు గిల్లుకుంటున్నారు.మరి ఈ లిస్ట్ లో నెక్స్ట్ ఛాన్స్ మీదే నాని గారూ.