తోడు దొంగల బ్రేకప్ ఆట!

రాష్ట్ర విభజన తరువాత మొదట్లో టీడీపీ బీజేపీ ల మధ్య రొమాన్స్ ఓ రేంజ్ లో సాగింది..ఇప్పటికీ సాగుతూనే ఉందనుకోండి అది వేరే విషయం.అయితే మొదటి నుండి ఇద్దరిమధ్య గిల్లికజ్జాలు షరా మాములే అన్నట్టుగా సాగింది సంసారం.ఇద్దరు చాలా వ్యూహాత్మకంగా ఒకరిపై ఒకరు అవసరానికి తగ్గట్టు ఆచి తూచి విమర్శించుకుంటూ వచ్చారు ఇన్ని రోజులు.

ఎప్పటికప్పుడు ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్లకు తోచిన విదంగా ఎదుటి వాళ్ళని వాడుకుంటూ వచ్చారు.ఈ విషయం లో బీజేపీ కంటే టీడీపీ అధినేత చంద్రబాబు రెండాకులు ఎక్కువే చదివారు.ఎప్పటికప్పుడు బీజేపీ పైన ప్రజల్లో వ్యతిరేకత అదే టైం లో టీడీపీ పై సానుభూతి పెరిగేలా చంద్రబాబు కార్యాచరణ సాగింది.

ఇక తాజాగా రాజ్య సభలో కేవీపీ ప్రయివేట్ మెంబెర్ బిల్లు దాని పై చర్చ తదనంతరం టీడీపీ పార్టీ తీరుపై సర్వత్రా ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యం లో చంద్రబాబు మైండ్ గేమ్ కి మరింత పదును పెట్టారు.ఎప్పటిలాగే తన భజన మండలి ,భజన మీడియా సాయం తో ప్రజల్లోకి బీజేపీ పై వ్యతిరేకత పెంచేస్తున్నాడు.బాబు మాత్రం ఎప్పటిలాగే బీజేపీ పైన ఎదురుదాడి చేయరు గాక చేయరు.ఒకరో ఇద్దరో మంత్రుల్ని ఉసిగొల్పుతారు.బిజెపికి విడాకులిచ్చేయాలంటూ జెసి దివాకర్‌రెడ్డి, బుద్దావెంకన్న, తమ పార్టీ నేతలను అడుగుపెట్టనీయకుండా అడ్డుకోవాలని బుచ్చయ్యచౌదరి తదితరులు రెండురోజుల నుంచి పాపం విరుచుకు పడిపోతున్నారు.

ఇక తమ భజన మీడియా సంగతి సరే సరి..బాబు ప్రెస్ మీట్ పెట్టి సుతారంగా,ఎంతో సున్నితంగా బీజేపీ ని ప్రశ్నిస్తే..ఈ భజన మీడియా మాత్రం కేంద్రం పై బాబు విరుచుకు పడ్డాడని ఊదరగొట్టేస్తుంది.ఈ మొత్తం వ్యవాహారం లో ఎప్పటికైనా నట్టేట ముందెగేది మనమే అని బీజేపీ గ్రహించింది.ఇప్పటికిప్పుడు కేసుల భయం తో కేంద్రాన్ని వెనకేసుకొచ్చినా ఎన్నికలప్పుడైనా చంద్రబాబు బీజేపీ నే బలిపశువుని చేస్తాడనే విషయం బీజేపీ కి అర్థమయింది.అదీగాక క్యాబినెట్‌లో ఉన్నందున తమ పార్టీకి, కార్యకర్తలకు రాజకీయంగా ప్రయోజనమేమీ జరగలేదంటున్నారు. విజయవాడ గుళ్ల కూల్చివేత విషయాన్ని తమ పార్టీకి చెందిన మంత్రి మాణిక్యాలరావుకు చెప్పలేదని, వైద్యశాఖలో కూడా నేరుగా సీఎంఓనే నిర్ణయాలు తీసుకుంటోందని గుర్తు చేస్తున్నారు.టీడీపీ నీడ నుంచి బయటకొస్తే తప్ప, రాష్ట్రంలో పార్టీకి మనుగడ లేదన్న అభిప్రాయం మెజారిటీ నేతల్లో వ్యక్తమవుతోంది.

ఇక్కడ ఇద్దరు బీజేపీ మంత్రుల తీరే సొంత పార్టీ ని కలవర పరుస్తోంది.టీడీపీతో విడిపోవాలని మెజారిటీ నేతలు కోరుకుంటుండగా, మంత్రులు కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావు మాత్రం కలసి ఉండాలని కోరుకోవడం పార్టీ నేతలను విస్మయానికి గురిచేస్తోంది. తెదేపాతో కలసి ఉంటామని, పొత్తు కొనసాగుతోందని, కాంగ్రెస్-వైసీపీ తమ మధ్య దూరం పెంచే కుట్ర చేస్తున్నాయని ఇద్దరు మంత్రులు వ్యాఖ్యానించడాన్ని తప్పుపడుతున్నారు.సుజనాచౌదరి కేంద్రమంత్రిగా ఉంటూనే బిజెపిని విమర్శిస్తుంటే, తమ మంత్రులు మాత్రం టీడీపీపై ఎదురుదాడి చేయడంలో మొహమాటం ప్రదర్శించడాన్ని సహించలేకపోతున్నారు. బాబు సహా ఎంపీలు తమ పార్టీపై చేస్తున్న విమర్శలకు తగిన జవాబు చెప్పకుండా, కలసి ఉండాలని ప్రకటించడం బట్టి వారు మానసికంగా ఎటు వైపు మొగ్గుచూపుతున్నారో స్పష్టమవుతోందని వ్యాఖ్యానిస్తున్నారు.

టీడీపీ నీడ నుంచి బయటకొస్తే తప్ప, రాష్ట్రంలో పార్టీకి మనుగడ లేదన్న అభిప్రాయం మెజారిటీ నేతల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటివరకూ చంద్రబాబునాయుడే తమ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారని, అందుకే సభ్యత్వాలు ముగిసి, అన్ని రాష్ట్రాలకూ అధ్యక్షులను నియమించినా, ఏపిలో మాత్రం నియమించలేదని బిజెపి సీనియర్లు తమ అంతర్గత సంభాషణల్లో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.