ట్విట్టర్ చూసి షాక్ అయ్యా

క్రీడాచరిత్రలోనే రజత పతకాన్ని సాధించిన తొలి బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా రికార్డు సృష్టించిన సిల్వర్‌స్టార్‌ సింధు గత కొన్నిరోజులుగా ప్రశంసల వర్షంలో తడిసి ముద్దయిపోతుంది.ఇప్పుడు కాస్త తీరిక దొరకటం తో తన ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసిందట. ఓపెన్ చేయగానే అందులో ట్వీట్ చూసి షాక్ అయ్యిందట.

ఇంతకీ ఆ ట్వీట్ చేసింది ఎవరనుకుంటున్నారా సూపర్ స్టార్ రజినీకాంత్. సింధుని ప్రశంసిస్తూ ‘నేను నీ అభిమానినయ్యా’ అంటూ సూపర్‌స్టార్‌ రజనీకాంత్ ట్విట్టర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారంట. రజనీకాంత్ ట్వీట్‌ చూసి పట్టరాని ఆనందానికి లోనైంది సింధు. ‘సార్‌.. థాంక్యూ సో మచ్ సార్‌.. మాటలు రావడం లేదు. నా ఆనందాన్ని వర్ణించడానికి మాటలు లేవు’ అంటూ రీట్వీట్‌ చేసింది.