చిన్నారిని చూసి చలించిపోయిన రామ్

విశాఖపట్నం ఎం వీ పి కాలనీ లో 5 ఏళ్ళ చిన్నారి (కుందన పూర్ణచంద్రిక) దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతోంది పుట్టిననాటి నుంచి చిన్నారి నడుము కింద భాగం చ చ్చుబడిపోయింది.తల్లిదండ్రులు ఈ చిన్నారిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. అయితే చిన్నారికి మాత్రం వర్థమాన కథానాయకుడు రామ్ అంటే చాలా ఇష్టం.

సినిమా షూటింగ్ కోసం విశాఖపట్నం వెళ్లిన రామ్ కు చిన్నారికి గురించి తెలియగానే శుక్రవారం సాయంత్రం కుందనని కలవాటనికి ఎం వీ పి కాలనీ కి రామ్ వెళ్లారు. చిన్నారితో కొంతసేపు ముచ్చటించిన రామ్. కుందన దుస్థితి చూసి చలించిపోయి కంటతడి పెట్టుకున్నారు.కొద్దిసేపటికి తనను తాను వారించుకుని శనివారం మధ్యాహ్నం తనతో భోజనం చేయడానికి కుటుంబ సభ్యులను ఆహ్వానించాడు. హీరో రామ్‌ను చూసిన ఆనందం చిన్నారి కళ్లలో స్పష్టంగా కనిపించింది.