గ్యారేజ్ సెన్సార్‌ రిపోర్టు కెవ్వు కేక 

‘జనతా గ్యారేజ్‌’ సినిమా షూటింగ్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుని షూటింగ్‌ అనంతరం సెన్సార్‌ బోర్డుకెళ్లింది. సెన్సార్‌ బోర్డు ఈ సినిమాకి యు/ఎ సర్టిఫెకేట్‌ ఇచ్చింది. దాంతో ఈ సినిమాపై ఇప్పటివరకూ ఉన్న అంచనాలను మించి భారీగా అంచనాలు పెరిగాయి. సెన్సార్‌ బోర్డు అందించిన పోజిటివ్‌ రిపోర్టుతో చిత్ర బృందం కాన్ఫిడెన్స్‌ మరింత రెట్టింపయ్యింది.

ఇంతవరకూ కొరటాలకు ఫ్లాప్‌ అనేదే లేదు. అన్నీ హిట్‌ సినిమాలే. ప్రబాస్‌కు ‘మిర్చి’ సినిమాతో హిట్‌ ఇచ్చాడు. మహేష్‌కు ‘శ్రీమంతుడు’తో భారీ హిట్‌ ఇచ్చాడు. ఇప్పుడు ఎన్టీఆర్‌ వంతు వచ్చింది. అసలే ఎన్టీఆర్‌ కూడా ఇప్పుడు వరుస సక్సెస్‌లతో ఫుల్‌ జోరుగా ఉన్నాడు. ఈ సినిమా సక్సెస్‌ అయితే ఎన్టీఆర్‌ హ్య్రాటిక్‌ కొట్టేసినట్లే. ఎన్టీఆర్‌తో పాటు కొరటాలకు కూడా ఇది హ్యాట్రిక్‌ కానుంది. ఇవన్నీ కాక ఈ సినిమా 100 కోట్ల వసూళ్ల క్లబ్‌లో చేరిపోవడం పక్కా అంటున్నాయి సినీ వర్గాలు.

ఈ సినిమాలో మోహన్‌లాల్‌ పాత్ర పెద్ద ఆకర్షణ కానుంది. మోహన్‌లాల్‌ నటించడంతో మల్లూవుడ్‌లో కూడా ఈ సినిమా పాపులర్‌ కానుంది. అక్కడ కూడా భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ ఇద్దరు ముద్దుగుమ్మలతో జతకడుతున్నాడు. సమంత, నిత్యామీనన్‌లు ఎన్టీఆర్‌కి జోడీగా నటిస్తున్నారు. భారీ నుంచి అతి భారీ అంచనాల నడుమ ఈ సినిమా సెప్టెంబరు 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతేకాదు ఇంతవరకూ ఏ తెలుగు సినిమా విడుదల కానన్ని ధియేటర్లలో ఈ సినిమాను విడుదల చేయాలనే యోచనలో ఉంది చిత్ర యూనిట్‌.