కుర్ర హీరోలతో మల్టీ స్టారర్ ప్లాన్ చేసిన పూరి

నందమూరి కల్యాణ్ రామ్ తో పూరి జగన్నాథ్ ‘ఇజం’ తెరకెక్కిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తవగానే మహేష్ బాబుతో ‘జనగణమణ’ సెట్స్ పైకి తీసుకెళ్తారని అంతా అనుకున్నారు. కానీ అది కాస్త ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో.. ఈ గ్యాప్ లో మరో సినిమా చేయాలని పూరి డిసైడ్ అయ్యారట.

ఇదో మల్టీ స్టారర్ అని.. అంతా.. కుర్ర హీరోలతోనే ఉంటుందని ఫిల్మ్ నగర్ టాక్. ఈ సినిమా కోసం యువహీరో నాగశౌర్యను ఫైనల్ చేశారని అంటున్నారు. మరో కథానాయకుడిగా ‘పెళ్లిచూపులు’ ఫేమ్ విజయ్ దైవరకొండను తీసుకుంటారని వార్తలొస్తున్నాయి.

పూరి తీయనున్న ఈ యూత్ ఫుల్ మల్టీస్టారర్ ఓ ప్రేమకథ అని సమాచారం. ఈ సినిమాకు హీరోయిన్ ను ఇంకా ఫైనల్ చేయలేదు. ఈ న్యూస్ నిజమే అయితే.. యువ హీరోలు నాగశౌర్య, విజయ్ దేవర కొండలకు కెరీర్ లో ప్రమోషన్ లభించినట్టే.