కాజల్ కు వార్నింగ్ నిజమ

తమిళంలో అజిత్‌ 57వ మూవీ షూటింగ్‌లో నిమగ్నమైంది అందాల కాజల్. యూరప్‌లో వివిధ లొకేషన్స్‌లో చిత్రీకరణ సాగుతోంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్ర డైరక్టర్ శివ కాజల్‌కు క్లాస్ తీసుకున్నాడట. అమ్మడి ట్విట్టర్ ఉత్సాహం భరించలేకే.. శివ ఆమెపై కాస్త సీరియస్ అయ్యాడట. విషయంలోకి వెళ్తే.. ఈ మధ్య కాజల్ ట్విట్టర్‌లో ఓ రేంజ్‌లో సందడి చేస్తోంది. తన సినిమాలకు సంబంధించి ఫొటోలు ఎడాపెడా పోస్ట్ చేస్తోంది. జీవాతో చేసిన మూవీ చిత్రాలూ ఇలాగే జనాలకు తెలిసిపోయాయి. ఆ సినిమాలో స్మిమ్మింగ్‌పూల్‌లో తడిసిన దుస్తుల్లో ఉన్న పిక్చర్స్‌నూ సోషల్‌మీడియాలో పెట్టేసింది.

ఈ ట్రెండ్‌నే అజిత్ మూవీకీ ఫోలో అయింది ఈ సొగసరి. అయితే.. దర్శకుడికి మాత్రం చిర్రెత్తుకొచ్చింది. అజిత్ మూవీకి సంబంధించిన లుక్స్‌ను శివ సీక్రెట్ గా ఉంచాలనుకున్నాడు. కానీ కాజల్ అత్యుత్సాహంతో ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ఫొటోలు బయటకొచ్చేశాయి. దీంతో..శివ.. ఈ బ్యూటీకి గట్టిగానే క్లాస్ తీసుకున్నాడని కోలీవుడ్ జనాలు అంటున్నారు. ఈ సినిమాలో కమల్‌హాసన్ రెండో కుమార్తె అక్షర కూడా నటిస్తోంది. ముందుజాగ్రత్తగా కాజల్ చేసినట్లు నువ్వు ఇలాంటివేమీ చేయకంటూ ఆమెకూ చెప్పారట.