కవిత కూడా ఏపీ వైపే

ఇంతలో ఎంత మార్పు..రాజకీయం అంటే ఇదే నేమో..రెండేళ్ల క్రితం వరకు ఛీ..తూ అన్నవారే ఇప్పుడు బాసటగా నిలుస్తున్నారు..తెలంగాణాలో ఆంధ్ర విద్యా సంస్థల్ని నిషేదిస్తాం..తెలంగాణలో ఆంధ్ర హోటళ్లు నడవనివ్వం..ఇంకా మాట్లాడితే ఆంధ్రోళ్ళను తరిమి కొడతాం అన్న తెరాస నాయకులే ఇప్పుడు హైదరాబాద్ లో ఆంధ్ర సెట్ట్లెర్స్ కి రెడ్ కార్పెట్ పరుస్తాం..ఆంధ్రోళ్ల కాళ్ళో ముళ్ళు గుచ్చుకుంటే పంటితో తీస్తాం అనే స్థాయికి వచ్చేసారు.అదే మరి రాజకీయం అంటే.

ఇక అసలు విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా అంశం పై ఇదివరకే రాజ్యసభలోను లోక్ సభలోను తెలంగాణ ప్రభుత్వం మద్దతు పలికింది.తాజాగా తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ కుమార్తె కవిత కూడా ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే నంటూ నిందించారు.కృష్ణా జిల్లాలోని నందిగామ అనాసాగ‌రంలో ఓ ప్రైవేటు ఫంక్షన్‌లో క‌విత ఈరోజు పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా అంశంపై ఎంపీ కవిత స్పందించారు.

ఏపీ కి ప్రత్యేక హోదా విషయం లో తెలంగాణా మద్దతు ఎప్పుడు ఉంటుందనీ,ఆ రోజున పార్లమెంటులో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీని నిలబెట్టుకునే బాధ్యత ఎన్డీఏ ప్ర‌భుత్వానిదేన‌ని వ్యాఖ్యానించారు.ఆంధ్ర ప్రదేశ్ కి ప్రత్యేక హోదా పై కేంద్రం కుంటి సాకులు వెతకడం సరికాదన్నారు.ఏదయినా సాంకేతిక సమస్యలుంటే నిజంగా ఎన్డీఏ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రాజకీయంగానైనా నిర్ణయం తీసుకోవచ్చని కవిత పేర్కొన్నారు.ఈ మాత్రం తెగువ ఆంధ్ర పాలకుల్లో ఉంటే బీజేపీ కి ఇంత అలుసెందుకు మనకు ఈ యాచనెందుకు.