ఎన్టీఆర్ నా ప్రాణం కంటే ఎక్కువ.

ఎన్టీఆర్‌ కోసం తన ప్రాణాన్ని సైతం లెక్కచేయనని హీరో మంచు మనోజ్‌ అంటున్నాడు. ట్విట్టర్‌ వేదికగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు మనోజ్‌ ఈ సమాధానం ఇచ్చాడు. ‘అన్నా మీకు ఎన్టీఆర్‌ అంటే ఎంత ఇష్టం?’ అని ఓ ఫ్యాన్ మనోజ్‌ను ప్రశ్నించాడు. దీనికి రెస్పాన్స్‌గా మనోజ్‌ ‘నా ప్రాణం లెక్కచేయనంత(స్మైల్‌)’ అని ట్వీట్‌ చేశాడు.

ఇంకేముంది ఈ ట్వీట్‌ చూసిన ఎన్టీఆర్‌ అభిమానులంతా ధన్యవాదాలు, సూపర్‌ అన్నా అని కామెంట్స్‌ పోస్ట్ చేశారు. ప్రస్తుతం మనోజ్‌ మూడు కొత్త చిత్రాల్లో నటిస్తున్నాడు. ప్రసన్న దర్శకత్వంలో ‘సీతా మహాలక్ష్మి’( మదర్‌ ఆఫ్‌ ర్యాంబో), ఎస్‌.కె. సత్య దర్శకత్వంలో ఒక చిత్రం, అజయ్‌ ఆండ్రూస్‌ నూతక్కి దర్శకత్వం వహిస్తున్న మరో మూతో మనోజ్ బిజీగా ఉన్నాడు.