ఇరువురి భామల నడుమ ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ ‘జనతా గ్యారేజ్’. ఈ సినిమా షూటింగ్.. ఇపుడు దాదాపుగా కంప్లీట్ అయిపోయింది. రీసెంట్ గా కేరళ వెళ్లి పాటలు పాడుకున్న హీరో హీరోయిన్ల ఫోటోలను పోస్టర్ల రూపంలో విడుదల చేసింది చిత్రబృందం. ఆగస్ట్ 12న ఆడియో లాంచ్ నేపథ్యంలోనే ఈ పోస్టర్లను విడుదల చేశారు. కేరళ ప్రకృతి అందాల మధ్య హీరోహీరోయిన్లు పరుగెడుతున్న ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటోంది.

షార్ట్‌ డ్రస్‌లో సమంత, మోడ్రన్‌ లుక్‌లో నిత్యా మీనన్‌లను చూస్తుంటే.. ఈ సినిమాలో యాక్షన్‌తో పాటూ గ్లామర్‌ పాళ్లూ బాగానే ఉన్నాయని అర్ధమవుతోంది. ఇక హీరో.. ఎన్టీఆర్ డ్రసింగ్ కూడా స్టైలిష్‌గా ఉంది. ‘జనతా గ్యారేజ్’కు సంబంధించి ఇప్పటివరకూ సీరియస్ లుక్‌లోని హీరోనే చూపించారు. కానీ సినిమాలోని ఎంజాయ్‌మెంట్ తాలూకు చిత్రం విడుదల కావడం ఇదే తొలిసారి. ఎన్టీఆర్ రొమాంటిక్ పిక్చర్ కూడా బయటకు రావడంతో అభిమానులు ఆనందపడిపోతున్నారు.