అమలాపాల్‌కి ఎంత కష్టం వచ్చిందో!

నేచురల్‌ బ్యూటీ విడాకుల రచ్చ ఈ మధ్య మీడియాలో హడావిడి చేస్తోంది. తమిళ డైరెక్టర్‌ విజయ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్న అమలాపాల్‌ మొదట్లో చాలా అన్యోన్యంగా మా దాంపత్య జీవితం సాగిందని చెబుతోంది. కానీ కొన్ని కారణాల వల్ల వీరిద్దరి మధ్యా బేధాభిప్రాయాల రావడం, కుటుంబ సభ్యులు సర్ది చెప్పాల్సింది పోయి ఆ గొడవలకి ఆధ్యం పోయడంతో ఈ గొడవ కాస్తా విడాకుల వరకూ పోయింది. దాంతో ఒకరికొకరు విడిపోయి తమ జీవితాలు తాము ప్రశాంతంగా గడపాలని నిశ్చయించుకున్నారు. ఇందులో భాగంగా ఒకరినొకరు మీడియా ముఖంగా అనవసరమైన ధూషణలు చేసుకోకుండా ఉండాలని అనుకుంటున్నారట.

అంతేకాదు, సామరస్యంగా విడిపోవాలనీ అనుకుంటున్నారట. అందుకే మీడియాలో తమ గురించి ఏ విధమైన నెగిటివ్‌ న్యూస్‌ రాయద్దని కూడా చెబుతోందట అమలా పాల్‌. ఇకపై ఆమె భర్తతో విడాకులు తీసుకుని, విరివిగా సినిమాల్లో నటిస్తానని చెబుతోంది. తమ విడాకుల కేసు నిమిత్తం మీడియాలో రోజుకో న్యూస్‌ హాట్‌ హాట్‌గా హల్‌ చల్‌ చేస్తున్నాయి. ఇది తనకి నచ్చలేదంటూ గుర్రుమంటోంది అమలాపాల్‌.

విడాకులు తీసుకోవడం అనే ప్రక్రియ తానొక్కతే కొత్తగా చేస్తోంది కాదు. గతంలో చాలామంది సెలబ్రిటీలు ఇలా పెళ్లి చేసుకుని విడిపోయినవాళ్లే. మా మీద ఎవ్వరూ అత్యుత్సాహం చూపించొద్దు అంటూ ఘాటుగా స్పందిస్తోంది ముద్దుగుమ్మ అమలా పాల్‌.