అభిమానులకు టెన్షన్ పుట్టిస్తున్న పవన్

తన లేటెస్ట్ సినిమా మ్యాటర్లో పవర్ స్టార్ అనుసరిస్తున్న వ్యూహాలు… అతని ఫ్యాన్స్ కు ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సెంటిమెంట్స్ ను గుర్తుకు తెస్తున్నాయి.దీంతో పవన్ అభిమానులకు లేనిపోని టెన్షన్ పట్టుకుంది. ఇదే విషయం అటు పరిశ్రమలోను టాక్ అయిపోయింది.ఇంతకీ పవన్ అనుసరిస్తోన్న వ్యూహమేంటి..?

‘సర్దార్ గబ్బర్ సింగ్’ నిర్మాణం జరిగినప్పుడు జరిగిన సంఘటనలే ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవుతున్నాయి.‘సర్దార్’ సినిమా మొదలు అయ్యాక ఆ సినిమా దర్శకుడు సంపత్ నందిని తప్పించి పవన్ ఆ బాధ్యతను దర్శకుడు బాబికి అప్పగించాడు. అదే విధంగా పవన్ లేటెస్ట్ సినిమా విషయంలో కూడ దర్శకుడు ఎస్.జె. సూర్యను తప్పించి డాలీకి ఈ సినిమాను అప్పగించడం అనుకోకుండా జరిగినా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ రిపీట్ అయినట్లుగానే భావిస్తున్నారు పవన్ అభిమానులు.

అదే విధంగా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ షూటింగ్ పూణే లో మొదలు అయిన తరువాత కొంత గ్యాప్ ఇచ్చి పవన్ ఆ సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు.ఇప్పుడు కూడ అదేవిధంగా పవన్ తన లేటెస్ట్ సినిమా షూటింగ్ మొదలైన రెండు వారాల గ్యాప్ తరువాత ఆగష్టు మూడవ వారం నుండి షూటింగ్ లో జాయిన్ అవుతూ ఉండటంతో గత సినిమాకు సంబంధించిన సంఘటనలు సెంటిమెంట్స్ గా ఎందుకు రిపీట్ అవుతున్నాయి అని పవన్ అభిమానులు కలవర పడుతున్నారు.ఇది చాలదు అన్నట్లుగా పవన్ లేటెస్ట్ సినిమా ఫస్ట్ లుక్ పవన్ పుట్టినరోజు సెప్టెంబర్ 2న విడుదల కాబోతోంది. గత సంవత్సరం కూడ ఇదే విధంగా పవన్ పుట్టినరోజు నాడు ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఫస్ట్ లుక్ విడుదల అయింది. ఇలా ఫస్ట్ లుక్ విడుదల అవడంలో కూడ పవన్ ‘సర్దార్’ సంఘటనలు మళ్ళీమళ్ళీ అనుకోకుండా రిపీట్ అవుతూ ఉండటం దేనికి సంకేతం అంటూ పవన్ అభిమానులు తల పట్టు కుంటున్నారు.

ఇప్పటికే ఈ లేటెస్ట్ సినిమాకు సంబంధించి కూడ పవన్ స్క్రిప్ట్ విషయంలో తల దూర్చడమే కాకుండా కొన్ని డైలాగ్స్ వెర్షన్ పవన్ సూచనలతో మార్పులు చేర్పులు చేసారు అన్న వార్తలు ఉన్నాయి. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ స్క్రిప్ట్ విషయంలో కూడ ఇలాంటి సంఘటనలే జరిగాయి.పవన్ స్క్రిప్ట్ లో వేలు పెట్టడం వల్ల జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది.ఇలా ఎన్నో పోలికలు పవన్ లేటెస్ట్ సినిమా విషయంలో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సంఘటనలను గుర్తుకు చేస్తున్నాయి .అదే పవన్ అభిమానులను బాధ పెడుతోంది.