సమంతకి చిర్రెత్తుకొచ్చింది పాపం

వారం రోజులుగా టాలీవుడ్-కోలీవుడ్‌ల్లో సమంతాపై ఓ రేంజ్‌లో వార్తలొస్తున్నాయి. అమ్మడు పెళ్లి చేసుకుని సెటిలైపోతోందన్న వార్తల జోరు పెరిగిపోయింది. ఇటీవలిగా కొత్త సినిమాలేవీ ఒప్పుకోకపోవడం.. ఓకే చేసిన వాటినీ వదిలేసుకోవడంతో.. సామ్‌ ఖచ్చితంగా మ్యారేజ్‌ ప్లాన్‌లో ఉందని అంతా నిర్ణయానికి వచ్చేశారు. ఈ విశ్లేషణలపై ఈ బ్యూటీ స్పందించింది.

“కొందరికి ఫోన్ చేసి అనవసర వాగుడు కట్టిపెట్టండి అని చెప్పాలనిపిస్తోంది” అంటూ ఉదయం 8.43నిమిషాలకు ట్వీట్ చేసింది. “ఏం చేస్తోనో ఎప్పుడు చేస్తానో అది పూర్తిగా నా వ్యక్తిగతం. నేను చెప్పేవరకూ వేచి ఉండడం మీ పని” అని వెంటనే మరో ట్వీట్‌ కూడా వదిలింది. సమంతా-అక్కినేని నాగచైతన్య త్వరలోనే వివాహబంధంతో ఒక్కటవుతున్నట్లు అంతా చెప్పుకుంటున్నారు. ప్రసార మాధ్యమాల్లోనూ వీరిపై ఫోకస్ ఎక్కువైంది. తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనాలసిస్‌లు జోరందుకోవడంతోనే సమంతా అసహనం వ్యక్తం చేసిందని చెప్పుకుంటున్నారు.