‘శాతకర్ణి’పై బాలీవుడ్‌ ఇంట్రెస్ట్‌

క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం గౌతమీ పుత్ర శాతకర్ణి’. బాలకృష్ణ 100వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై తెలుగులో భారీ అంచనాలున్నాయి. బాలకృష్ణ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌ మూవీగా ఈ సినిమా రూపొందుతోంది. తెలుగులోనే కాకుండా, తమిళంలో కూడా ఈ సినిమా డబ్‌ కానుంది. అయితే క్రిష్‌కి తమిళంతో పాటు హిందీలో కూడా బాగా ఫాలోయింగ్‌ ఉంది.

బాలీవుడ్‌లో క్రిష్‌ అక్షయ్‌కుమార్‌, శృతిహాసన్‌, కరీనాకపూర్‌తో ‘గబ్బర్‌ ఈజ్‌ బ్యాక్‌’ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా అక్కడ విజయం సాధించింది. సో క్రిష్‌కి బాలీవుడ్‌తో పరిచయం బాగానే ఉంది. దాంతో బాలకృష్ణ ‘శాతకర్ణి’ సినిమాను కూడా హిందీలో డబ్‌ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి ‘శాతకర్ణి’ సినిమా తెలుగు నేటివిటీకి అనుసంధానంగా ఉండే సినిమా. కానీ క్రిష్‌ సినిమా యూనివర్సల్‌ అప్పియరెన్స్‌గా ఉంటుంది. సో బాలీవుడ్‌కి కూడా సెట్‌ అయిపోతుంది.

క్రిష్‌ డైరెక్షన్‌లో వచ్చిన ‘కంచె’ సినిమాకి కూడా బాలీవుడ్‌లో బాగా ఆదరణ లభించింది. కేవలం క్రిష్‌ గురించే ఈ సినిమాను ఆదరించారు బాలీవుడ్‌ ప్రేక్షకులు. సో ఈ రకంగా ‘శాతకర్ణి’ సినిమా కూడా బాలీవుడ్‌లో సందడి చేసేందుకు అవకాశాలు అనుకూలంగా ఉన్నాయటున్నాయి ఫిల్మ్‌ నగర్‌ వర్గాలు. శరవేగంగా ఈ సినిమా షూటింగ్‌ జరుపుకుంటోంది. ఈ సినిమాలో ముద్దుగుమ్మ శ్రియ హీరోయిన్‌గా నటస్తోంది.