వెంకయ్య బొంకు రామాయణం..

బీజేపీ లో వెంకయ్య నాయుడి రేంజే వేరు.పార్టీకి ఏసమస్యవచ్చినా వెంకయ్యే దారిచూపుతుంటారు.వెంకయ్య వాక్చాతుర్యం గురించి కొత్తగా చెప్పేదేముంది.అయన మైక్ పట్టుకుంటే ఎక్కడ మొదలెడుతారో ఎక్కడ ముగిస్తారో ఆయనకే తెలీదు.అలా తడుముకోకుండా అనర్గళంగా ఉపన్యాసాలు దంచేస్తారు ఈ నాయుడు గారు.అలాంటి ఈయన మన తెలుగోడు అవడం అందులోనా రాష్ట్రం విడిపోయి కష్టకాలం లో ఉన్న మనందరికీ వారమనుకున్నారు అందరు.

అందులోనా ఈ నాయుడు గోరు అధికార బీజేపీ పార్టీ వాడు, అందునా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయం లో అవశేషాన్ద్రప్రదేశ్ కోసం గొంతు చించుకుని పార్లమెంట్ లో ప్రత్యేకహోదా కోసం నినదించిన మహనీయుడు .పాపం అదేంటో గాని అధికారం చేతికొచ్చాక గతాన్ని మర్చిపోయాడు వెంకయ్య.ప్రత్యేకహోదా ఊసే లేదు..ఆంధ్రకు జరిగిన జరుగుతున్న అన్యాయం పై అడిగే నాధుడే లేదు.

కేవీపీ ప్రత్యేక హోదాపై ప్రయివేటు మెంబెర్ బిల్లు రాజ్యసభలో చర్చ సందర్భంగా దేశంలోని బీజేపీయేతర పార్టీలన్నీ కేంద్రం వైఖరిని ప్రశ్నిస్తూ బీజేపీ ని ఇరుకునపెట్టేశాయి .ఇందులో టీడీపీ పాత్రేమీ లేదు సుమీ.ఇంకేముంది ప్రవక్త వెంకయ్య నాయుడుగారు ఈ విషయంపై స్పందించక తప్పలేదు.ఎందుకంటే ఎవ్వరు మాట్లాడినా విభజన జరిగిన రోజున వెంకయ్య నాయుడు చేసిన హడావిడి గురించే ప్రస్తావించారు.ఆ రోజు 5 కాదు కాదు 10 ఏళ్ళు ప్రత్యేక హోదా అని కదం తొక్కి ఇప్పుడు కప్పను మింగిన పాములా వెంకయ్య చోద్యం చూస్తుండడం గురించే ప్రశ్నించారు .

వెంకయ్య నాయుడు చక్కగా కథలు చెప్పి కాలక్షేపం చేసేందుకు ప్రయత్నించాడు కానీ అంతగా వర్కౌట్ కాలేదు.ఇంత సీరియస్ ఇష్యూ మీద చర్చ జరుగుతొంటే నాయుడుగారి ఆ బాధ లేదు..ఛలోక్తులు..సామెతలు..సినిమా స్టోరీలు ఇలా సరదాగా ప్రసంగించేసారు వెంకయ్య.

అసలు ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇస్తే అన్నీ కష్టాలు తీరిపోతాయా అంటూ ఎదురు ప్రశ్నించారు.అయినా కాంగ్రెస్ ప్రత్యేక హోదా యాక్ట్ లో ఎందుకు పెట్టలేదు అని ఎదురు ప్రశ్నించారు.ఇదంతా ఎక్కడో విన్నట్టుందనుకుంటున్నారా..అదేనండి మన ముఖ్యమంత్రి నాయుడు గారు కూడా ఇవే బొంకులు బొంకుతుంటారు కదా.ఎంతైనా మిత్రపక్ష పార్టీ లు,పార్టీ నాయుళ్ళ బొంకురమాయణం మాత్రం పళ్ళు తేడా లేకుండా సేమ్ టు సేమ్ అనమాట.అయినా మిగతా రాష్టాలు ప్రత్యేక హోదా అడుగుతున్నాయ్..వేరే రాష్ట్రాలు కూడా లోటుబడ్జెట్ తో వున్నాయి..ఈ హరికథలెందుకు..ఒకటే సూటి ప్రశ్న..ప్రత్యేక హోదా సంజీవిని కానప్పుడు..ఆరోజు పార్లమెంట్ లో మీరెందుకు నినదించారు?బీజేపీ టీడీపీ పార్టీ లు తమ తమ ఎన్నిక మేనిఫెస్టో లో ప్రత్యేక హోదా అంశాన్ని ఎందుకు చేర్చాయి..ఎన్నికల ప్రచార సభల్లో ప్రస్తుత ప్రధాని మోడీ ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ కి మేము అధికారం లోకి వస్తే 10 ఏళ్ళు ప్రత్యేక హోదా ఇస్తాం అని ఎందుకు చెప్పారు..ఈ ఒక్క దానికి సమాధానం చెప్పండి నాయుడు జీ..ఎన్నేళ్లు రాజకీల్లో వున్నాం అన్నది కాదు నాయుడు..చేసే రాజకీయాల్లో నీతేంతున్నది అనేదే ముఖ్యం.

అసలు ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ కి కేంద్రం చేసిన సాయం వెంకయ్య దగ్గర పెద్ద లిస్ట్ ఉందట.పాపం టైం చాలా లేనందువలన అన్నీ చదవలేక పోతున్నాడట.వెంకయ్య గారు పబ్లిక్ లో ఈ మాటనకండి సార్ ప్లీజ్..జనాలు అసలే వెర్రెత్తిపోయున్నారు..ఎం చేస్తారో ఏమో..పార్లమెంట్ సాక్షిగా ప్రధాన మంత్రి హామీ ఇచ్చారు.ప్రతిపక్షం మద్దతిచ్చింది..ఇప్పుడు వంకరమాటలతో వక్రభాష్యం చెప్పడం దేనికి సంకేతం.రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా పరిపాలిస్తే కాంగ్రెస్ కి పట్టిన గతే బీజేపీ కి కూడా పడుతుంది.కాకపోతే ఒకటే తేడా కాంగ్రెస్ ఇవ్వాళా కాకపోయియినా 5-10 ఏళ్ళకైనా కోలుకోగలదు..ఒక్క సారి బీజేపీ పడిపోతే మళ్ళీ లేవడం జరగదు.