విశాల్ కీ ఆ ‘ఒక్కడే’ దిక్కు

టాలీవుడ్ కీ ఒక్కడు అనే టైటిల్ కి అవినాభావ సంబంధం వుంది.అప్పుడేపెప్పుడో వచ్చిన ప్రిన్స్ మహేష్ బాబు బ్లాక్ బస్టర్ ఒక్కడు సినిమా తరువాత ఆ ఒక్కడు ని కదిపి కుమ్మేసి కలేసి మెలేసి వచ్చిన సినిమాలు ఎన్నో.వాటిలో కొన్ని హిట్ అవ్వగా ఇంకొన్ని ఫట్ అయ్యాయి.

ఒక్కడు చాలు, ఒకే ఒక్కడు, ఒక్కడు, ఒక్కడే, ఒక్కడున్నాడు, వీడొక్కడే, వీరుడొక్కడే, ఇలా తెలుగులో చాలా చిత్రాలొచ్చాయి. లేటెస్టుగా నారా రోహిత్ ‘అప్పట్లో ఒకడుండేవాడు’ అనే టైటిల్ తో రెడీ అవుతున్నాడు. విక్రమ్ ‘ఇరుముగన్’ను ‘ఇంకొక్కడు’గా తీసుకొస్తున్నారు.విశాల్ కొత్త మూవీ ‘కత్తి సండై’ను తెలుగులో ‘ఒక్కడొచ్చాడు’ పేరుతో అనువాదం చేస్తున్నారు.

సూరజ్ తెరకెక్కిస్తున్న ‘కత్తి సండై’ యాక్షన్ ఎంటర్టైనర్. ఈ చిత్రంలో విశాల్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా కథానాయికగా నటిస్తోంది. మన జగపతి బాబుతో పాటూ బాలీవుడ్ నటుడు తరుణ్ అరోరా విలన్లుగా నటిస్తున్నారు. సెప్టెంబర్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.