మహేష్ చూపు జగన్ వైపు!

తెలుగు సినీ రాజకీయాలు ఈ నాటివి కావు.ఒకప్పుడు నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించిన 11 నెలల్లో అధికారం చేజిక్కించుకుని దేశ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించారు.ఆతరువాత కూడా తెలుగు సినిమాకు రాజకీయాలకి విడదీయరాని బంధం అలాగే కొనసాగుతోంది.అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయ ఆరంగ్రేటం చేశారు.కృష్ణంరాజు,రామానాయుడు,సత్యనారాయణ,బాబుమోహన్ ఇలా ఎందరో సినీ ప్రముఖులు తమ రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకున్నవారే.

ఇక మెగా స్టార్ చిరంజీవి అయితే ఏకంగా ప్రజారాజ్యం పార్టీ ని స్థాపించి రాజకీయ ఆరంగ్రేటం చేశారు.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా జనసేన పార్టీ ని స్థాపించి రాజకీయాల్లో తనదయిన ముద్ర వేస్తున్నారు.తాజాగా పవన్ కళ్యాణ్ తో నంబర్ 1 నువ్వా నేనా అని పోటీపడుతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు రాజకీయ రంగప్రవేశానికి రంగం సిద్ధమైందని వాదనలు వినిపిస్తున్నాయి.దీనికి బలం చేకూరుస్తూ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు సినీ రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతున్నాయి.మహేష్ బాబు త్వరలోనే జగన తో కలిసి రాజకీయ ప్రయాణం మొదలు పెట్టనున్నారని డైలాగ్ కింగ్ మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.మోహన్ బాబు ఈ మధ్య కాలం లో రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనబోతున్నానని సంకేతాలిచ్చారు.అయితే ఇంతవరకు వైసీపీ లో చేరుతున్నట్టు అధికారికంగా ప్రకటిచలేదు.కాకపోతే మోహన్ బాబు ఎప్పటికైనా జగన్ సరసకు చేరుతాడన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.YS కుటుంబంతో మోహన్ బాబుకి బంధుత్వం కూడా ఉండటం,రాజశేఖర్ రెడ్డి అంటే మోహన్ బాబు కి ఎనలేని అభిమానం కూడా ఈ వాదనకి బలం చేకూరుస్తోంది.

సూపర్ స్టార్ కృష్ణ గారికి కాంగ్రెస్ పార్టీ తో మరీ ముక్యంగా దివంగత రాజశేఖర రెడ్డి గారితో మంచి అనుభందం ఉంది.దానికి కొనసాగింపుగా మహేష్ బాబు YSRCP అధ్యక్షుడు YS జగన్మోహన్ రెడ్డి తో కలిసి నడిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.ఇక్కడ ఇంకో కోణం కూడా ఉంది, మహేష్ బాబు బావ గల్లా జయదేవ్ టీడీపీ తరుపు MP గా వున్నారు.మహేష్ వైసీపీ లో చేరికకు అది పెద్ద అడ్డంకి కానుంది.కాగా మహేష్ ఏదయినా తన సొంత ఆలోచనలతోనే ముందుకెళ్తుంటారు అన్నది అతని సన్నిహితుల వాదన.ఈ విషయంపై ఇంతవరకు మహేష్ నోరుమెదపలేదు.మహేష్ మాట్లాడితే కానీ దీనిపై ఒక క్లారిటీ వచ్చే సూచన కనిపించడం లేదు.