ప్లీజ్ ఆ ఫోటోలు తీసేయండి:బాద్షా

అతను బాలీవుడ్ కే బాద్షా షారూఖ్ ఖాన్.అలాంటి షారూక్ కి తన చిన్నకూతురు ఫోటో ఒకటి వైరల్ కావడం తీవ్ర బాధకి గురిచేసింది. షారుక్ ఖాన్ కూతురు సుహాన బికినీతో ఉన్నప్పటి ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడం దుమారం రేపింది. ఈ ఫొటోలో సుహాన తన చిన్నారి తమ్ముడు అబ్రామ్తో కలసి ఉన్న ఈ ఫొటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది . ఈ ఘటనపై షారుక్ స్పందించాడు. దీనిపై షారుక్ మాట్లాడుతూ తన కూతురు సుహాన వయసు 16 ఏళ్లు అని, తానేదో బీచ్ లో తమ్ముడితో కలిసి అడ్డుకుంటున్న ఫోటో ని ఇలా వివాదం లోగో కలగడం సర్కాదన్నాడు . సోషల్ మీడియాలో నుంచి ఈ ఫొటోను తొలగించాలని కోరాడు.

అసలామె తన కూతురు కాకపోయింటే వార్త అయ్యేదికాదని షారుక్ అన్నాడు. తన కుమార్తె బికినీలో తన బాడీని ప్రదర్శిస్తోందని వ్యాఖ్యలు చేయడం కుసంస్కారమని అన్నాడు. తాను ఇంకా చిన్నపిల్ల అని, ఆమె బికినీ ఫొటోలను పోస్ట్ చేయడం దారుణమని చెప్పాడు. సుహానె ఫొటో వైరల్ కావడానికి తన స్టార్ డమ్ కారణమన్నాడు.నిజమే ఓ 16 ఏళ్ల అమ్మాయి ఏదో సరదాగా తమ్ముడితో ఆడుకుంటూ తీసుకున్న ఫోటో ని ఇలా బాడీ ప్రదసిస్తోందంటూ వైరల్ చెయ్యడం నిజంగా దారుణం.ఇప్పటికైనా సోషమీడియాలో దీనిపై రాద్ధాంతం చెయ్యడం ఆపేస్తారని కోరుకుందాం.