ప్రభాస్‌తో రాజమౌళి మళ్ళీనా? 

ఐదారు హిట్‌ సినిమాలతో వచ్చే పేరుని ‘బాహుబలి’ సినిమాతో సొంతం చేసుకున్నాడు ప్రభాస్‌. రాజమౌళితో ఇప్పటికే ‘ఛత్రపతి’ లాంటి హిట్‌ అందుకున్న ప్రభాస్‌, ఆ అనుభవంతోనే రాజమౌళి అడగ్గాన్నే బల్క్‌ డేట్స్‌ని అతనికి ఇచ్చేశాడు. డేట్స్‌ కాదు, కెరీర్‌ మొత్తాన్ని రాజమౌళికి ప్రభాస్‌ సమర్పించేశాడనడం కరెక్ట్‌. ప్రభాస్‌ అంతలా తనను నమ్మినందుకుగాను ప్రభాస్‌కి ఇండస్ట్రీ హిట్‌ని రాజమౌళి ఇచ్చేశాడు. ఇంకో హిట్‌ ఇవ్వడానికి ‘బాహుబలి కంక్లూజన్‌’ని సిద్ధం చేస్తున్నాడు. ఇక్కడితో ఆగిపోదట, ఇంకా వీరిద్దరి ప్రయాణం కలిసే కొనసాగనుందని సమాచారమ్‌.

‘బాహుబలి’ కంక్లూజన్‌ పూర్తయ్యాక ప్రభాస్‌ రెండు సినిమాలు చేసేస్తాడు చకచకా. వాటికి ప్రిపరేషన్‌ కూడా పూర్తయ్యింది. సైమల్టేనియస్‌గా రాజమౌళితో ప్రభాస్‌ మరో సినిమా చేయనున్నాడని సమాచారమ్‌. ‘బాహుబలి’లా కాకుండా పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ ఒకటి రాజమౌళి ప్లాన్‌ చేశాడట. గ్రాఫిక్స్‌ లాంటి జోలికి వెళ్ళకుండా ఓ మాస్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ చెయ్యాలని రాజమౌళి అనుకోవడం, ఆ విషయాన్ని ప్రభాస్‌ దృష్టికి తీసుకురావడంతో ‘నో’ చెప్పకుండా ప్రభాస్‌ ఓకే చెప్పేశాడని సమాచారమ్‌. ఏదేమైనా ఓ దర్శకుడితో ఇంత ర్యాపో బహుశా ఈ మధ్యకాలంలో ఇంకే హీరోకీ లేదని చెప్పవచ్చేమో. ఇండస్ట్రీలో అందర్నీ ప్రభాస్‌ డార్లింగ్‌ అని పిలుస్తాడు. ప్రభాస్‌ కూడా అంతే. అంతకన్నా స్ట్రాంగ్‌ బాండింగ్‌ రాజమౌళి, ప్రభాస్‌ మధ్య ఉందని చెప్పడం నిస్సందేహం.