‘పోకిరి’ స్టయిల్లో పూరి:ఇజం

పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో కళ్యాణ్‌రామ్‌ హీరోగా ‘ఇజం’ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ని, టైటిల్‌ని ఇప్పటికే విడుదల చేశారు. ఇందులో కళ్యాణ్‌రామ్‌ డిఫరెంట్‌ గెటప్‌లో కనిపిస్తున్నాడు. పక్కా మాస్‌ ఎంటర్‌టైనర్‌ ఈ చిత్రం. ఇందులో కళ్యాణ్‌రామ్‌ పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందట. మామూలుగానే పూరి సినిమాల్లో హీరో డిఫరెంట్‌ మ్యానరిజంతో కనిపిస్తాడు. ఇంతవరకూ తన సినిమాల్లోని హీరోకి ఉండే డిఫరెంట్‌ బాడీలాంగ్వేజ్‌తోపాటు, ఇంకా కొత్తగా కళ్యాణ్‌రామ్‌ క్యారెక్టర్‌ హీరోయిజం ఈ సినిమాలో ఉండేలా పూరి అనేక జాగ్రత్తలు తీసుకున్నాడని సమాచారమ్‌.

పూరి కెరీర్‌లో మహేష్‌బాబుతో చేసిన ‘పోకిరి’ సినిమా ఆల్‌ టైం హిట్‌. అంతేకాదు రికార్డుల మోత మోగించేసింది కూడా. ‘పోకిరి’ తర్వాత ఆ స్థాయిలో పూరి, ఈ సినిమాతో చెలరేగిపోనున్నాడని అంటున్నారు. కళ్యాణ్‌రామ్‌ గెటప్‌ పూర్తిగా మార్చేశాడట ఈ సినిమా కోసం పూరి. ఇటీవల ‘పటాస్‌’ సినిమాతో భారీ హిట్‌ని అందుకున్న కళ్యాణ్‌రామ్‌ కూడా ఈ సినిమాపై ఫుల్‌ కాన్ఫిడెన్స్‌తో ఉన్నాడు. అదే నిజమైతే నందమూరి హీరో కళ్యాణ్‌రామ్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌ సొంతం చేసుకుంటాడు. ‘ఇజం’ అనే టైటిల్‌ అనౌన్స్‌ చేసి ఇప్పటికే సగం సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తున్నాడు పూరీ. ఇక సినిమా విషయానికి వచ్చేసరికి, సినిమాలో ట్విస్ట్‌లు ప్రేక్షకుల్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తాయట. ధియేటర్‌లో కూర్చున్నంత సేపు ప్రేక్షకులు ఉత్కంఠతో ఎదురు చూసే సన్నివేశాలు అనేకం ఉంటాయట సినిమాలో.