బన్నీ మళ్ళీ బుక్ అవుతాడా:’గమ్మునుండవోయ్’

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కి మరోసారి అల్లు అర్జున్ ఝలక్ ఇచ్చాడు.సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డుల (సైమా) వేడుక గురువారం అంగరంగ వైభవంగా మొదలైన సంగతి తెలిసిందే. రెండు రోజులపాటు సింగపూర్లో జరుగనున్న ఈ వేడుకల్లో గురువారం తెలుగు, కన్నడ సినిమాలకు సంబంధించిన అవార్డులను అందించగా, శుక్రవారం తమిళ, మలయాళ సినిమాలకు అవార్డులు ఇవ్వనున్నారు. కాగా అల్లు అర్జున్కు ఉత్తమ నటుడిగా క్రిటిక్స్ అవార్డు చారిత్రాత్మక చిత్రం ‘రుద్రమదేవి’లో గోన గన్నారెడ్డి పాత్ర పోషించినందుకుగాను లభించింది.

ఈ సందర్బంగా వేదికపై అవార్డు అందుకున్న అనంతరం బన్నీ మాట్లాడుతుండగా ‘పవర్ స్టార్.. పవర్ స్టార్..’ అంటూ పవన్ అభిమానులు పాత పాట మళ్ళీ అందుకున్నారు. దీంతో కాస్త అసౌకర్యానికి లోనైన బన్నీ వారిని ఉద్దేశించి.. ‘హే గమ్మునుండవోయ్.. మాట్లాడనీ’ అంటూ  తిరిగి తన మాటలను కొనసాగించారట. ఇదివరకే ఓ సినీ వేడుకలో పవన్ ఫ్యాన్స్ ఇలానే గోల చేస్తుంటే .. కాస్త పద్ధతిగా ప్రవర్తించండంటూ బన్నీ వారికి కాస్త చురకలంటించగా ఆ తర్వాత అది ఫ్యాన్స్ మధ్య పెద్ద వివాదాన్నే సృష్టించింది. బన్నీ తిరిగి వివరణ కూడా ఇచ్చుకోవాల్సిన రేంజ్ కెళ్ళింది. మళ్ళీ సైమా వేడుకలో అదే రిపీట్ అవ్వడంతో బన్నీ స్పందించక తప్పలేదు,కాకపోతే ఈ సారి తాను అవార్డు అందుకున్న రుద్రమదేవి సినిమాలో తన మేనరిజం అయిన గమ్మునుండవోయ్ మాట్లాడనీ అంటూ లైట్ గా తీసుకున్నాడు.మరి ఈసారేమవుతుందో!